ఆహారంలో బొద్దింక.. ఐఆర్సీటీసీకి రూ.లక్ష జరిమానా!

3 Aug, 2014 15:01 IST|Sakshi

న్యూఢిల్లీ:రైళ్లలో సరఫరా చేస్తున్న ఆహారంలో నాణ్యత లోపించడంతో ఐఆర్సీటీసీకి(ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్) రూ.లక్ష జరిమానా పడింది.   ట్రైన్లలో సరఫరా చేస్తున్న ఆహారాన్ని గత వారం పర్యవేక్షించిన అధికారులకు బొద్దింక కనబడటంతో ఈ జరిమానాను విధించారు. కోల్ కతా రాజధాని రైల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు ఆహారంలో బొద్దింక ఉండటాన్ని గుర్తించి అవాక్కయ్యారు. దీంతో ఈ ఆహారాన్నిసరఫరా చేస్తున్న ఐఆర్సీటీసీ రూ.లక్ష జరిమానా విధించారు.

 

జూలై 23 వ తేదీన ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన రైల్వే అధికారులు 13 రైళ్లలో సరఫరా చేసే ఆహారంలో నాణ్యత లోపించినట్లు గుర్తించారు. ఇందుకు గాను ఐఆర్సీటీసీ మరియు తొమ్మిది కేటరింగ్ సెక్షన్లకు రూ.11.50 లక్షల జరిమానాను విధించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

మరిన్ని వార్తలు