రైల్వే విశ్రాంతి గదులు.. ఇక స్వర్గధామాలు

15 Sep, 2015 22:15 IST|Sakshi

అత్యాధునిక వాష్ రూమ్స్, ఛేంజింగ్ రూమ్స్, వైఫై, ఇంటర్ నెట్, లైవ్ టీవీ, మ్యూజిక్ ఛానెల్స్, బఫెట్ సర్వీస్, న్యూస్ పేపర్లే, పుస్తకాలు, లగేజ్ ర్యాక్స్, షూ షైనర్, ట్రైన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, పిలిస్తే పలికే ద్వారపాలకుడు.. ఇన్నాళ్లూ ఎయిర్ పోర్టుల్లో మాత్రమే పరిమితమైన ఉన్న ఈ తరహా అత్యున్నత శ్రేణి విశ్రాంతి గదులు ఇప్పుడు రైల్వే స్టేషన్లలోనూ అందుబాటులోకి రానున్నాయి.

దక్షిణమధ్య రైల్వే పరిధిలోకి వచ్చే విజయవాడ, విశాఖపట్టణం స్టేషన్లు సహా దేశంలోని 19 ప్రముఖ రైల్వే స్టేషన్లలో ఎగ్జిక్యూటివ్ లాంజ్ ల నిర్మాణానికి ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) సన్నాహాలు మొదలుపెట్టింది. వచ్చే ఏడాది జనవరి నాటికి రైలు ప్రయాణికులకు అత్యున్నత సేవలు అందుబాటులోకి వస్తాయని ఐఆర్సీటీసీ తెలిపింది.

విజయవాడ, విశాఖతోపాటు ఈ ప్రాజెక్టుకు ఎంపికైన రైల్వే స్టేషన్లలో జైపూర్, ఆగ్రా, న్యూ ఢిల్లీ, కథ్గోదామ్, పాట్నా, సీల్దా, హౌరా, భువనేశ్వర్, అమ్మదాబాద్, పూరి, నాగ్పూర్, మథురై, బెంగళూరు, లూథియానా, అమృత్సర్, లక్నో, గోరఖ్ పూర్ స్టేషన్లు కూడా ఉన్నాయి.

 

 

>
మరిన్ని వార్తలు