ఆ తరంగాలు ఏలియన్లవేనా?

18 Nov, 2016 22:21 IST|Sakshi
ఆ తరంగాలు ఏలియన్లవేనా?
ఏలియన్లు మన రేడియో తరంగాలకు స్పందించాయా?. ఏలియన్ల గురించి పెద్ద ఎత్తున పరిశోధనకు ఈ ఏడాది చైనాలో అతిపెద్ద టెలిస్కోప్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏలియన్లపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు పంపిన రేడియో తరంగాలకు ఏలియన్ల నుంచి సమాధానం వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
 
విశ్వంలో అతిపెద్ద రేడియో తరంగాల విస్ఫోటనం జరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఒకే పాలపుంతలోని నక్షత్రాల వల్లే విస్ఫోటనం సంభవించిందని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం కాస్మిక్ విస్ఫోటనం లేదా ఎలియన్లు మానవులు పంపిన తరంగాలకు సమాధానంగా ఏదైనా పంపి ఉండొచ్చని అంటున్నారు.
 
కాగా, ఈ విస్ఫోటనానికి ఎఫ్ ఆర్బీ150807 అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. విస్ఫోటనంలో పెద్ద మొత్తం రేడియో తరంగాలు విడుదలైనట్లు చెబుతున్నారు. ఈ తరంగాలన్ని కేవలం 1 మిల్లిసెకను కాలంపాటే ఉన్నాయట. తొలుత ఆస్ట్రేలియాలోని పార్కేస్ టెలిస్కోప్ ఈ రేడియో తరంగాల విస్ఫోటనాన్ని గుర్తించిందటా. ఆ తర్వాత ప్యూర్టె రికోలోని అరెకిబో రేడియో టెలిస్కోప్, అమెరికాలోని గ్రీన్ బ్యాంకు టెలిస్కోప్ లు ఈ విస్ఫోటనాన్ని గుర్తించాయి. టెలిస్కోప్ లలో రికార్డయిన రేడియో తరంగాల విస్ఫోటనాన్ని బట్టి భూమి ఎంత దూరంలో ఇది జరిగిందో గుర్తించవచ్చు.
మరిన్ని వార్తలు