బంగారం షాపులు, ఫారెక్స్ కంపెనీలపై దాడులు

11 Nov, 2016 20:51 IST|Sakshi
బంగారం షాపులు, ఫారెక్స్ కంపెనీలపై దాడులు
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను బ్యాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన అనంతరం నల్ల కుబేరులు వణికిపోతున్నారా?. తాజా పరిస్ధితులు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. గత మూడు రోజులుగా పెద్దనోట్లను చలామణిలోకి తీసుకురావడానికి నల్ల కుబేరులు నానాతంటాలు పడుతున్నారు. బంగారం షాపులు, ఫారెక్స్ కంపెనీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారనే సమాచారంతో వాటిపై ఐటీ, ఈడీలు దాడులకు పూనుకోవడంతో వారిలో మరింత కలవరం మొదలైంది.
 
బంగారం షాపుల నగదు లావాదేవీలను ఐటీ శాఖ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అంతేకాదు ఫారెక్స్ కంపెనీలపై ఈడీ ప్రత్యేక దృష్టి సారించింది. దేశంలోని 67 ఫారెక్స్ కంపెనీలపై ఒకేసారి దాడులు చేసింది. కంపెనీలకు, బంగారు షాపులకు చెందిన అన్ని వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. గత మూడు రోజుల్లో రూ.2.5లక్షలకు పైచిలుకు జరిగిన లావాదేవీల వివరాలను అందజేయాలని ఐటీ శాఖ ఇప్పటికే బ్యాంకులను కోరిన విషయం తెలిసిందే.