ఐటీ ఉచ్చులో డిప్యూటీ సీఎం

19 Jun, 2017 21:22 IST|Sakshi
అక్కాతమ్ముళ్లకు ఐటీ ఝలక్‌

పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. లాలూ తనయుడు, బిహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌, లాలూ తనయ మీసా భారతిల ఆస్తులను ఆదాయ పన్ను శాఖ సీజ్‌ చేసింది.

తేజస్వీ, మీసా, ఆమె భర్త శైలేష్‌యాదవ్‌లకు చెందినవిగా భావిస్తోన్న ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ అధికారులు సోమవారం రాత్రి ఒక ప్రకటన చేశారు.

బినామీ ఆస్తుల వ్యవహారంలో విచారణా సంస్థ ఎదుట హాజరుకావాల్సిందిగా మీసా భారతికి గతంలో రెండు సార్లు సమన్లు జారీచేశామని, వాటికి ఆమె స్పందించకపోవడంతో దాడులు చేసి ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని ఐటీ అధికారులు తెలిపారు. తాజా వ్యవహారంపై లాలూ స్పందించాల్సిఉంది.

మరిన్ని వార్తలు