వారంలోగా ప్లాన్ సిద్ధంచేయాలని టెల్కోలకు ఆదేశం

13 Dec, 2016 12:44 IST|Sakshi
వారంలోగా ప్లాన్ సిద్ధంచేయాలని టెల్కోలకు ఆదేశం
నగదు రహిత లావాదేవీల పెంపుపై ఐటీ మంత్రిత్వశాఖ దృష్టిసారించింది. నగదు రహిత లావాదేవీలు పెంపుకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించుకోవాలని మొబైల్ టెలిఫోన్ సర్వీసు కంపెనీలను ఎలక్ట్రానిక్స్ అండ్ ఎన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆదేశించారు. వారంలోగా తమ ప్రణాళికలు తయారుచేయాలని సూచించినట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మంత్రి శుక్రవారం నిర్వహించిన జియో, ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్తో పాటు మరికొందరి టెల్కోల భేటీలో మంత్రి ఈ విషయాలు స్పష్టంచేసినట్టు అధికారులు పేర్కొన్నారు. . డిజిటల్ పేమెంట్ల ప్రకటనతో పాటు, ఫీచర్ల ఫోన్లనలో కూడా ఈ-పేమెంట్ల చెల్లింపులు జరిగేలా చూడాలని ఆదేశించారు.
 
వారంలోగా ప్రణాళికను తయారుచేసేందుకు వొడాఫోన్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పలు పరిష్కార మార్గాలను కూడా టెల్కోలు సూచించాలని ఆయన కోరారు. ఈ విషయంలో తమకు సాధ్యమైనంత రీతిలో టెల్కోలకు సాయపడతామని మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి చెప్పారు. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న డిజిటలైజ్ సర్వీసులను అందించడానికి టెల్కోలు అత్యవసరంగా వారి సదుపాయాలను మెరుగుపరుచుకోవాలని మంత్రి ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టెల్కోలు కనెక్టివిటీ సమస్యతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. వెంటనే తమ కార్యకలాపాలను విస్తరించుకోవాలని  ప్రభుత్వ రంగ కంపెనీ బీఎస్ఎన్ఎల్ను కూడా ప్రభుత్వం ఆదేశించింది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సర్వీసుల ప్రారంభించడానికి అనువుగా టెలికాం కంపెనీలు సన్నద్ధమవ్వాలని ఆదేశించినట్టు అధికారులు చెప్పారు.   
 
మరిన్ని వార్తలు