ఈ ఏడాదీ వృద్ధి బాటలోనే ఐటీ కంపెనీలు

5 Jan, 2015 00:22 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీ ఐటీ కంపెనీలు ఈ ఏడాది కూడా వృద్ధి బాటన పయనిస్తాయని పీడబ్ల్యూసీ సర్వే అంటోంది. అమెరికా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండడం, ఐటీపై బ్యాంకుల వ్యయం పెరగడంతోపాటు భారీ ఒప్పందాలతో ఇది సాధ్యమవుతుందని పేర్కొంది. నూతన వ్యాపార విధానాలు, టెక్నాలజీ మోసాలు, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో కొత్త విభాగాలు, ప్రభుత్వ ఉత్తమ పాలన వంటి అంశాలు అంతర్జాతీయ ఐటీ రంగంలో భారత స్థానాన్ని పదిలం చేస్తాయని పీడబ్ల్యూసీ ఇండియా టెక్నాలజీ లీడర్ సందీప్ లడ్డా అన్నారు.

డేటా కేంద్రాల ఆధునీకరణ, వర్చువలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ తదితర విభాగాలు భవిష్యత్ మార్కెట్‌ను నడిపిస్తాయని తెలిపారు. జాతీయ ఈ-గవర్నెన్స్ ప్రణాళిక, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టులు 2014లో దేశీ ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలకు అవకాశాలను తెచ్చిపెట్టాయని చెప్పారు.

స్మాక్ టెక్నాలజీదే..
సోషల్, మొబైల్, అనలిటిక్స్, క్లౌడ్(స్మాక్ ) ఆధారిత బీపీవో సేవల కంపెనీలు భవిష్యత్‌ను ప్రభావితం చేస్తాయని ఏజిస్ గ్లోబల్ సీఈవో సందీప్ సేన్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి ఐటీకి డిమాండ్ పెరుగుతుండడంతో ఈ కంపె నీల మధ్య భాగస్వామ్యాలు, ఒప్పందాలు, క్రయ విక్రయాలు నమోదవుతాయని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు