అమెరికా సబ్సిడరీ వాటా అమ్మనున్న ఐటీసీ

10 Oct, 2016 14:14 IST|Sakshi

ముంబై: ప్రముఖ  ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం, సిగరెట్ ఉత్పత్తి  మేజర్  ఐటీసీ  అమెరికాలోని తన సబ్సిడరీ సంస్థ 'కింగ్‌ మేకర్‌ మార్కెటింగ్‌' లో పూర్తి వాటాను విక్రయించాలని  భావిస్తోంది. అమెరికా  మార్కెట్ లో  ఐటీసీ  సిగరెట్ ఉత్పత్తులను  విక్రయించే ఈ కంపెనీలోని  వాటా విక్రయానికి  (24 మిలియన్ డాలర్లు) రూ.160 కోట్లకు  ఒప్పందం కుదుర్చుకుంది.  ఈ మేరకు ఈ ప్రతిపాదనకు  కార్పొరేట్ నిర్వహణ కమిటీ  ఆమోదం  లభించిందనీ  బీఎస్ఈ  ఫైలింగ్ లో ఐటీసీ తెలిపింది. అక్టోబర్ 8, 2016 న ఈ ఒప్పందం నమోదు చేయబడిందనీ, ఈ డీల్ ముగిసిన అనంతరం అమెరికా లోని కింగ్ మేకర్ మార్కెటింగ్ సంస్థతో  తమ సబ్సిడరీ  ముగుస్తుందని స్పష్టం చేసింది.

కాగా అమెరికాలోని  న్యూజెర్సీ రాష్ట్రం కేంద్రంగా  కింగ్‌ మేకర్‌ మార్కెటింగ్‌ సేవలు అందిస్తోంది. కింగ్‌ మేకర్‌ మార్కెటింగ్ లో ఏస్, చెకర్స్ , హెచ్ఐ వాల్, గోల్డ్ క్రెస్ట్ బ్రాండ్లు ప్రధానంగా ఉన్నాయి.  ఈ  వార్తలతో ఐటీసీ షేర్ 1,85 శాతం లాభపడి రూ 240.85 వద్ద  ట్రేడవుతోంది.

 

మరిన్ని వార్తలు