చిట్టి అమ్ము.. అమ్మగా ఎలా మారింది?

26 Aug, 2016 18:15 IST|Sakshi
చిట్టి అమ్ము.. అమ్మగా ఎలా మారింది?

తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కోమలవల్లి సినీరంగంలోకి ఎలా ప్రవేశించింది? మైనారిటీ తీరకముందే మెచ్యూర్డ్ క్యారెక్టర్లు చేసి సినీరంగంలో సంచలనాలు ఎలా సృష్టించింది? జయలలిత.. అంటే కేవల స్క్రీన్ నేమేకాదు.. ఇట్స్ ఏ బ్రాండ్ అనేంతగా ఎదిగేందుకు ఆమెకు సహకరించిందెవరు? తనకన్నా 30 ఏళ్లు పెద్దవాడైన ఎంజీ రామచంద్రన్ తో ఆమె అనుబంధం ఎలాంటిది? ఆయన మరణం తర్వాత ఏఐఏడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టి.. ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవడం వెనుక ఎలాంటి తెగువ ప్రదర్శించారు?  పురుషాధిక్య పోకడలు అడుగడుగునా కనిపించే భారతదేశంలో మీసం తిప్పే మగ నాయకులు సైతం ఆమెకు పాదాభివందనాలు చేస్తారు.. నిజంగా జయ దేవతా? 68ఏళ్ల ముదిమి వయసులోనూ ఉల్లాసంగా పనిచేయడానికి ఆమెకు శక్తి ఎక్కడి నుంచి వస్తోంది? ఏ బలం ఆమెనింత బలవంతురాలిని చేసింది? అసలు.. నాటి చిట్టిపొట్టి అడుగుల చిన్నారి అమ్ము.. నేడు అమ్మగా ఎలా మారింది?

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా రూపుదిద్దుకున్నదే 'అమ్మ'(జయలలిత: జర్నీ ఫ్రం మూవీ స్టార్ టు పొలిటికల్ క్వీన్) పుస్తకం. ప్రముఖ జర్నలిస్టు వాసంతి రచించిన ఈ మినీ బయోగ్రఫీలో జయలలిత జీవితంలో చోటుచేసుకున్న అనేక పరిణామాలను ఆసక్తికరంగా పొందుపర్చారు. జయ చిన్నతనం నుంచి 2015లో ఆరోసారి సీఎంగా ప్రమాణం చేసేంతవరకు జరిగిన సంఘటనలను ఈ పుస్తకంలో ఆవిష్కరించారు.  200 పేజీల 'అమ్మ' ధర రూ.299 మాత్రమే. సెప్టెంబర్ 7న విడుదల కానున్న 'అమ్మ'ను అమెజాన్ లో రూ.224కే పొందొచ్చు.

మరిన్ని వార్తలు