టాలెంట్‌ ఉన్నోళ్లు కనిపించట్లేదు: జబర్దస్త్‌ ఆర్పీ

27 May, 2017 10:32 IST|Sakshi
టాలెంట్‌ ఉన్నోళ్లు కనిపించట్లేదు: జబర్దస్త్‌ ఆర్పీ

చిల్లకూరు: ‘జబర్దస్త్‌’తో నవ్వులు పూయిస్తూ వెండితెరపైనా సత్తాచాటుకుంటున్న వర్ధమాన నటుడు రాటకొండ ప్రసాద్‌ అలియాస్‌ ఆర్పీ. ఆయన సొంతూరు నెల్లూరు జిల్లా ఓజిలి మండలం సగటూరు.

షూటింగ్‌ లేని సమయంలో తన వారిని కలుసుకునే ఆర్పీ.. చిన్న చిన్న సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూడు. అలా శుక్రవారం తన స్నేహితులతో కలిసి చిల్లకూరు వచ్చిన ఆర్పీని ‘సాక్షి’ పలుకరింగా మనస్సులోని మాటలను పంచుకున్నాడు..

ఎంత వరకు చదువుకున్నారు?
డిగ్రీ వరకు చదువుకున్నా. ప్రాథమిక విద్య సగటూరు, చిలమానుచేను, ఇంటర్‌ నాయుడుపేట చదలవాడ జూనియర్‌కళాశాల,   డిగ్రీ గూడూరులోని స్వర్ణాంధ్ర భారతిలో చదివా.

జబర్దస్త్‌లోకి రాక ముందు ఏమి చేసేవారు?
చదవు పూర్తి చేసిన తరువాత హైదరాబాద్‌ వెళ్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరా. సాధ్యం, గురుడు, గేమ్‌ వంటి చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గాపనిచేశా.

జబర్దస్త్‌లో ప్రవేశం ఎప్పడు?
2014 నవంబరులో జబర్దస్త్‌లో ప్రవేశించా.ఇప్పటి వరకు 270 స్కిట్‌లు చేసా.

సినిమాలపై దృష్టి సారించారా?
గుర్తింపు తెచ్చే పాత్ర కోసం ఎదురు చూస్తున్నా. ఇప్పటకే పది సినిమాల్లో నటించా. ప్రస్తుతం పెద్ద సినిమా చేస్తున్నా. పెద్ద డైరెక్టర్‌ కావాలన్నదే తన లక్ష్యం.

కొత్త వారికి ప్రోత్సాహం ఎంతవరకు ఉంటుంది?
కొత్త వారిని ప్రోత్సహించేందుకు ఎప్పుడూ సిద్ధమే. మంచి టాలెంట్‌ ఉన్న వారు కనిపించడంలేదు. ఇటీవల మహేష్‌ కనిపించాడు. అతనిలోని టాలెంట్‌ను గుర్తించి అవకాశాలు ఇస్తున్నాం.

ఏమైనా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారా?
గూడూరులో జూన్‌ మొదటి వారంలో ఒక కార్యక్రమాన్ని ప్రదర్శిస్తున్నా. తద్వారా వచ్చే నగదుతో పేదలకు సాయం అందించేందుకు చేయూత ఫౌండేషన్‌ను ప్రారంభిస్తున్నా.  

చివరగా పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు?
త్వరలోనే చేసుకుంటా. అమ్మాయి కోసం వెతుకుతున్నా కనబడగానే చేసుకుంటా(నవ్వూతూ) 

మరిన్ని వార్తలు