కావూరికి వ్యాపార ప్రయోజనాలే ముఖ్యం

3 Apr, 2014 13:19 IST|Sakshi
కావూరికి వ్యాపార ప్రయోజనాలే ముఖ్యం

కేంద్ర మంత్రి పదవికి ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కావూరు సాంబశివరావు రాజీనామా చేయడంపై ఆయన మంత్రి వర్గ సహచరుడు, జీవోఎం సభ్యుడు జై రాం రమేష్ గురువారం న్యూఢిల్లీలో స్పందించారు.గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కావూరి సాంబశివరావుకు ఓ సిద్దాంతమంటూ లేని జై రాం రమేష్ ఆరోపించారు. వ్యాపార ప్రయోజనాల కోసమే కావూరి సాంబశివరావు పార్టీ మారుతున్నారని విమర్శించారు. విభజన అంశంపై కేబినెట్లో చర్చ జరుగుతున్నప్పుడు కావూరి ఎప్పుడూ వాకౌట్ చేయలేదని జై రాం రమేష్ గుర్తు చేశారు. సూడాన్లో పవర్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ తీసుకుని పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. దాంతో భారత్ ప్రభుత్వానికి కావూరి వల్ల చెడ్డ పేరు వచ్చిందన్నారు.

40 ఏళ్లుగా కాంగ్రెస్ నుంచి కావూరి ఎంతో మేలు పొందారన్నారు. కావూరి రాజీనామాపై స్పందించాలని జై రాం రమేష్ను విలేకర్లు కోరగా ఆయన పై విధంగా స్పందించారు.అయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో కేంద్ర సహాయ మంత్రి పురందేశ్వరీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో జై రాం రమేష్ స్పందిస్తూ... దుగరాజు పట్నంలో వేల ఏకరాలు స్థలాలు పురందేశ్వరీ కొనుగోలు చేసిందంటూ ఘాటైన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

కావూరి సాంబశివరావు కేంద్రమంత్రి పదవికి గురువారం రాజీనామా చేశారు. పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపే ఆర్డినెన్స్ను పక్క పెట్టడంపై తాను తీవ్రంగా కలత చెందానని ఈ నేపథ్యంలో  తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు కావూరి ఈ రోజు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తన రాజీనామా లేఖను స్వయంగా ప్రధాని మన్మోహన్ సింగ్కు కావూరి అందజేసిన సంగతి తెలిసిందే.కావూరి సాంబశివరావు టీడీపీలో చేరేందుకు సిద్ధపడగా, ఆపార్టీలో తలుపులు మూసుకుపోయాయి. దాంతో ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకున్న తర్వాతే రాజీనామా లేఖను సిద్ధం చేసుకున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు