పోలీస్‌ స్టేషన్‌ లో నిర్భయను మించిన ఘోరం

9 May, 2017 16:54 IST|Sakshi
పోలీస్‌ స్టేషన్‌ లో నిర్భయను మించిన ఘోరం
శ్రీనగర్: ఢిల్లీ నిర్భయ గ్యాంగ్ రేప్ ను మించిన దారుణం ఒకటి  ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే ఈ ఘటనలో నిందితులు సాక్షాత్తు పోలీసులే కావడం మరింత ఆందోళన  రేకెత్తించింది. జమ్మూలోని కనాలాల్ పోలీస్ స్టేషన్లో కొన్ని రోజుల క్రితం  ఈ దారుణం చోటు చేసుకుంది.  
 
వివరాల్లోకి వెళితే జమ్మూ కానాచక్ ప్రాంతానికి చెందిన  చెందిన ఓ మహిళను (25) దొంగతనం ఆరోపణలపై  అదుపులోకి తీసుకున్నారు. అనంతరం  స్టేషన్ హౌస్ ఆఫీసర్  ఆమెపై  నిర్హయ గ్యాంగ్‌  రేప్‌ తరహాలో తీవ్ర హింసను ప్రయోగించడంతోపాటు, లైంగికంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు.  కస్టడీలో ఉన్నపుడు కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వకుండా వేధించాడు. అయితే మే 6వ తేదీన బెయిల్‌ మంజూరు కావడంతో  తనకు జరిగిన ఘోరంపై   న్యాయవాది సహాయంతో పోరాటానికి సిద్దపడింది బాధితురాలు.
 
స్టేషన్‌ ఎస్.ఓ.ఒ.రాకేశ్ శర్మ ఒక వారంపాటు తనను హింసించిన తీరును మీడియాకు బాధితురాలు  వివరించింది. తీవ్రమైన హింసతోపాటు,  లైంగిక దాడికి  పాల్పడ్డాడని,   ప్రయివేట్‌ పార్ట్స్‌ లో బీర్‌ బాటిల్‌  .. కారంపొడిని  చల్లారని ఆరోపించింది.కస్టడీలో ఉన్నప్పుడు తినడానికి ఏమీ ఇవ్వలేదని బాధితురాలు  వాపోయింది. నీళ్ళు అడిగితే,  మూత్రం త్రాగమంటూ పోలీసులకు అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించింది.  తనపై తప్పుడు కేసులు  బనాయించడంతో పాటు,  తల్లి, భర్త,  పిల్లలను పోలీసులు  తీవ్రంగా కొట్టినట్టు కూడా ఆ మహిళ ఆరోపించింది.

బాధితురాలి తరపు న్యాయవాది ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. నిర్భయ కేసులోమాదిరిగా పోలీసులు ప్రవర్తించారని మండిపడ్డారు. కాపాడాల్సిన పోలీసులే బాధితురాలపై  క్రూరత్వాన్ని చాటుకున్నారని ఆయన ఆరోపించారు.మరోవైపు ఈ ఘటనపై  ప్రధానమంత్రి కార్యాలయంలోని సహాయ మంత్రి జితేంద్ర సింగ్ జమ్మూ-కాశ్మీర్ ప్రభుత్వాన్ని  వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా  కోరారు. ఈ ఉదంతంపై ర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. 
 
మరిన్ని వార్తలు