7రోజుల్లో రూ.1,487 కోట్లు

12 Dec, 2016 14:52 IST|Sakshi
7రోజుల్లో రూ.1,487 కోట్లు

న్యూఢిల్లీ:  పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రధానమంత్రి జన్ ధన్  యోజన్ ఖాతాల్లో  నగదు  డిపాజిట్ల వర్ద క్రమంగా  తగ్గుముఖంపడుతోంది. ముఖ్యంగా గత వారం రోజుల కాలంలో  స్పల్పంగా  తగ్గింది.  ఏడు రోజుల్లో సుమారు రూ.1,487కోట్లు  డిపాజిట్ అయ్యాయి. ఇది నవంబరు 30  నాటికి వీటి విలువ 8,283కోట్లు డిపాజిట్ కాగా ఈ వారంలో  డిపాజిట్ల విలువ క్రమంగా  తగ్గుముఖం పట్టినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం నవంబరు 30నాటికి 25.85 కోట్ల ఖాతాల్లోరూ. 74,321.55కోట్లు నమోదయ్యాయి. నవంబరు 23 నాటికి  25.68 కోట్ల ఖాతాల్లో మొత్తం  విలువ రూ.72,834.72 కోట్లు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నవంబరు 9 నాటికి  సుమారు రూ.45,637 కోట్ల డిపాజిట్లు పెరిగాయి.
కాగా 2014  ఆగస్టులో   ప్రధానమంత్రి జన్ ధన్ యోజన్ పథకాన్ని ప్రారంభించారు.  జన్ ధన్ ఖాతాల్లో  గరిష్ట డిపాజిట్ పరిమితి 50 వేలుగా నిర్ణయించారు.  అయితే డీమానిటైజేషన్  తర్వాత విత్ డ్రా పరిమితిని 10 వేలకు కుదించిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు