భర్తలను చంపి.. రూ.53 కోట్లు వెనకేసింది!

21 Nov, 2014 21:33 IST|Sakshi
భర్తలను చంపి.. రూ.53 కోట్లు వెనకేసింది!

వరుసపెట్టి పెళ్లిళ్లు చేసుకోవడం.. ఆ భర్తలను హతమార్చి, వారి పేరుమీద ఉన్న బీమా సొమ్మును తీసుకోవడం అలవాటుగా మార్చుకుందో మహిళామణి. సమాగమం తర్వాత తన మగ భాగస్వామిని చంపేసే అలవాటుండే సాలీడు పేరుమీద ఇలాంటి వాళ్లను 'బ్లాక్ విడో'లుగా పిలుస్తారు. చిసాకో కకెహి (67) అనే ఈ మహిళ ఇప్పటివరకు ఆరుగురు భర్తలను ఇలా చంపింది. తాజాగా 2013 డిసెంబర్ నెలలో 75 ఏళ్ల భర్తకు విషమిచ్చి చంపింది. ఇప్పటివరకు ఇలా బీమా రూపంలో గత పదేళ్లలో ఆమె సుమారు 53 కోట్ల రూపాయలు వెనకేసుకుంది.

ఇప్పుడు మరో ముసలి, బాగా డబ్బున్న వ్యక్తి ఎవరు దొరుకుతారా అని ఎదురు చూస్తోంది. తాను పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి ముసలివాడై ఉండాలని, ఒక్కడే నివసిస్తుండాలని కూడా మ్యారేజి బ్యూరోలకు చెబుతోంది. అతడు ఏదైనా వ్యాధితో బాధపడేవాడైతే మరింత మంచిదని కూడా చెప్పిందట. పశ్చిమ జపాన్లో వేర్వేరు పేర్లతో ఆమె పలు మ్యారేజి బ్యూరోలలో పేర్లు నమోదు చేయించుకుంది. క్యోటోలోని ఆమె ఇంట్లో పోలీసులు గురువారం సోదాలు చేసినప్పుడు అక్కడ సైనైడ్ ఆనవాళ్లు కనిపించాయి. తన భర్తలను చంపిన విషయాన్ని ఆమె అంగీకరించడంలేదు. జపాన్లో చాలా కాలంగా బ్లాక్విడోలు ఉన్నట్లు చరిత్ర ఉంది. ఇటీవలే కనే కిజిర్నా అనే మధ్య వయసు మహిళ ఒకరు తన ముగ్గురు భర్తలను చంపి వాళ్ల ఆస్తులు చేజిక్కించుకుంది.

మరిన్ని వార్తలు