మరోసారి దాడికి తెగబడ్డ ఉగ్రవాదులు: జవాన్ మృతి

9 Aug, 2015 11:37 IST|Sakshi

శ్రీనగర్: గడిచిన రెండు నెలలుగా తరచూ దాడులకు దిగుతున్న ఉగ్రవాద మూకలు మరోసారి పేట్రేగిపోయాయి. ఆదివారం ఉదయం కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖకు సమీపంలోని తంగ్ధర్ సెక్టార్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక జవాను మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ఉగ్రమూకల ప్రవేశాన్ని అడ్డుకునే క్రమంలో ఒక జవాన్ ప్రాణాలు కోల్పోయాడని, మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని ఆర్మీ అధికారులు చెప్పారు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతూనేఉన్నాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు