‘పార్లమెంటరీ’ కమిటీ చైర్మన్‌గా జేసీ దివాకర్‌రెడ్డి

3 Sep, 2014 00:24 IST|Sakshi
‘పార్లమెంటరీ’ కమిటీ చైర్మన్‌గా జేసీ దివాకర్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: ఆహారం, వినియోగదారుల వ్యవహారాల పార్లమెంటరీ  స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా టీడీ పీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను ప్రకటించగా, ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలకు కూడా సభ్యులుగా స్థానం దక్కింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు ఐదు స్టాండింగ్ కమిటీలకు నేతృత్వం వహించే అవకాశం లభించగా... మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ కూడా ఓ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా వ్యవహరించనుండడం విశేషం. కాంగ్రెస్ ఎంపీలు వీర ప్ప మొయిలీ, శశిథరూర్, పి.భట్టాచార్య ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, హోంశాఖ వ్యవహారాల స్టాండింగ్ కమిటీలకు చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

 

మొయిలీ ఆర్థిక కమిటీకి చైర్మన్‌గా, మన్మోహన్‌సింగ్ సభ్యుడిగా వ్యవహరించనున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, న్యాయ, సిబ్బంది వ్యవహారాల పార్లమెంటరీ కమిటీల చైర్మన్ పదవులు కూడా కాంగ్రెస్‌కు లభించాయి. ఇక, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ప్రభుత్వరంగ సంస్థల కమిటీల్లో సభ్యుడిగా బీజేపీ అగ్రనేత అద్వానీ నియమితులయ్యారు.

మరిన్ని వార్తలు