అమెజాన్‌ సీఈవో సంచలనం

30 Mar, 2017 11:19 IST|Sakshi
అమెజాన్‌ సీఈవో సంచలనం

ప్రముఖ  ఆన్లైన్ రీటైల్ దిగ్గజం అమెజాన్.కాం  స్థాపకుడు జెఫ్రీ ప్రెస్టన్ బెజోస్ (53) మరో ఘనతను సాధించారు.  ప‌్ర‌పంచ కుబేరుల జాబితాలో   రెండవ స్థానానికి ఎగబాకి సంచలనం సృష్టించారు.  అమెజాన్‌ షేరు  రికార్డ్‌ స్థాయికి  లాభాలనార్జించడంతో్ ఆయన ప్రపంచంలో రెండవ అత్యంత ధనవంతుడిగా  నిలిచారు.  దుబాయ్‌ ఆధారిత రీటైలర్‌ సాక్‌.కాం  కొనుగోలుకు యోచిస్తున్నట్టు  ప్రకటించన వెంటనే  అమెజాన్‌ షేర్‌  దూసుకుపోయింది.

బుధవారం ట్రేడింగ్ లో అమెజాన్ మార్కెట్ విలువ18.32 బిలియన్‌ డాలర్లు పెరిగింది.  బ్రెజోస్‌ ఆదాయంలో మరో 1.5 బిలియన్‌ డాలర్లు జత చేరాయి. ఈ నేపథ్యంలో బెజోస్ నికర ఆదాయం 75.6 బిలియన్‌ డాలర్లకు చేరింది.  బ్లూమ్‌ బర్గ్‌ బిలయనీర్స్‌ ఇండెక్స్ లో  రెండవ అతిపెద్ద ధనవంతుడిగా నిలిచారు.    ఈ ఏడాది  బెజోస్  సుమారు 10.2 బిలియన్‌ డాలర్లను ఆర్జించారని బ్లూమ్ బర్గ్‌  నివేదించింది. మరోవైపు 86 బిలియన్ల డాలర్లతో   ప్రపంచంలో  అతిపెద్ద ధనవంతుడిగా ఉన్న మైక్రోసాఫ్ట్‌ కో ఫౌండర్‌ బిల్‌గేట్స్‌  కంటే  కేవలం 10.4  బిలియన్లు దూరంలో  ఉన్నారు.

దీంతో  బెర్క్‌ఫైర్‌ హాత్వే సీఈవో,  ఇన్వెస్టింగ్‌ గురూ వారెన్‌ బఫెట్‌ (74.8 బిలియన్‌ డాలర్లు) మరోసారి వెనక్కి నెట్టేశారు.  దీంతో స్పెయిన్‌కు చెందిన వ్యాపారవేత్త, ఇండిటెక్స్‌ ఫౌండర్‌  అమాన్షియో ఒర్టెగా (74.2 బిలియన్ డాలర్లు) ను కూడా అధిగమించారు.  ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్  ఉన్న కంపెనీల్లో   ఒకటిగా  అమెజాన్‌ నిలవనుందని ఎనలిస్టులు విశ్లషిస్తున్నారు. 

మరిన్ని వార్తలు