జియో యూజర్లు సగం తగ్గిపోనున్నారట!

28 Feb, 2017 16:06 IST|Sakshi
జియో యూజర్లు సగం తగ్గిపోనున్నారట!

ముంబై: ఉచిత ఆఫర్లతో టెలికాం మార్కెట్లోకి దూసుకొచ్చిన రిలయన్స్‌ జియోకి సంబంధించి ఒక షాకింగ్‌ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్‌ తరువాత జియో ఖాతాదారుల సంఖ్య సగానికి పడిపోనుందట. ముఖ్యంగా హ్యాపీ న్యూ ఇయర్‌ ఆఫర్‌ మార్చి31తో ముగియ నుండటంతో   జియో యూజర్లు వేరే నెట్‌వర్క్‌కు మారిపోయే అవకాశం ఉందని  నివేదికలు వెలువడుతున్నాయి.

దాదాపు ఆరునెలలపాటు ఉచిత డ్యాటా, వాయిస్‌ సేవలను అనుభవించిన జియో ఖాతాదారులు ఏప్రిల్‌ నుంచి కొత్త తారిఫ్‌లు అమలుకానున్న నేపథ్యంలో జియో లో ఉండాలా వద్దా లేదా ఆలోచిస్తారని తెలుస్తోంది.  అలాగే డ్యాటా క్వాలిటీ,  స్పీడ్‌ పై  వేచి  సూచే ధోరణిని అవలంబించనున్నారన్న అభిప్రాయాలు వ్యక‍్తమవుతున్నాయి.

తాను రిలయన్స్‌ ప్రైమ్‌  మెంబర్‌ గా చేరినా.. జియో సేవల నాణ్యతపై  వేచి చూస్తానని కోలకతాకుచెందిన ప్రభుత‍్వ రంగ బ్యాంక్‌  రిటైర్డ్ జనరల్ మేనేజర్   షావోన్‌   దాస​ గుప్తా (69) చెప్పారు. ఈయన వాయిస్‌ కాల్స్‌కోసం వోడాఫోన్‌ ను వినియగిస్తే.. డాటా సర్ఫింగ్‌ కోసం  జియోను వాడతారట.  కోలకతా లో ఒక PSU ఒక  అతను జియో ప్రధాని చేరాల్సి కానీ దాని సేవలు ఏదైనా లోపం కోసం లుకౌట్ న ఉంటుంది అన్నారు. దాస్గుప్తా వోడాఫోన్ నుండి తన కాల్స్ చేస్తుంది మరియు డేటా సర్ఫింగ్ కోసం తన జియో సిమ్ ఉపయోగిస్తారట. మార్కెట్లో పోటీదారులతో పోలిస్తే జియో ధరలు బావుంటే కొనసాగుతానని, లేదంటే  వోడాఫోన్‌కు మళ్లీ తరలిపోనున్నట్టు  చెప్పారు.

కాగా  వెల్‌ కం ఆఫర్‌ తో సంచలనంగా దూసుకొచ్చిన జియో  హ్యాఫీ న్యూ ఇయర్‌ ఆఫర్‌ ను ప్రవేశపెట్టింది. ఇది మార్చి 31తో ముగియనుండడంతో   ప్రైమ్ మెంబర్‌ షిప్‌  స్కీం, కొత్త టారిఫ్‌ లను ప్రకటించింది.   ప్రైమ్ మెంబర్లుగా మారాలంటే ముందు రూ.99 చెల్లించాలి. ఈ ఫీజు ఏడాది వరకే చెల్లుబాటు అవుతుంది.  రిలయన్స్‌ అధినేత ముకేష​ అంబానీ ప్రకటించిన దాని ప్రకారం ఇలా మెంబర్లుగా మారిన తర్వాత ఫ్రీ ఆఫర్లు  వాడుకోవాలంటే మాత్రం నెలకి మరో 303 రూపాయలు చెల్లించాల్సిన సంగతి తెలిసిందే.  
 

మరిన్ని వార్తలు