ఉబెర్, జియో వ్యూహాత్మక భాగస్వామ్యం

20 Feb, 2017 20:48 IST|Sakshi
ఉబెర్, జియో వ్యూహాత్మక భాగస్వామ్యం

ముంబై: ఉచిత డ్యాటా, వాయిస్‌ సేవలతో సంచలనానికి తెరతీసిన రిలయన్స్ జియో మరో కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. తన చెల్లింపుల యాప్ ద్వారా   టాక్సీ అగ్రిగేటర్  ఉబెర్‌ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.  దీని ద్వారా జియో  వినియోగదారులకు మరో అవకాశాన్ని కల్పిస్తోంది.  మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు  చెందిన ప్రీపెయిడ్ వాలెట్ ద్వారా  చెల్లింపులకు అనుమతిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. ఉబెర్ రైడ్‌లకు గాను,     ప్రీ పెయిడ్‌ జియో మనీ ఆప్‌ ద్వారా చెల్లింపులను  త్వరలోనే తమ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్టు తెలిపింది.

ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా  దేశంలో అతిపెద్ద యూజర్‌ బేస్‌  ఉన్న రెండు సంస్థలకు  ఏకీకరణ డిజిటల్ ప్లాట్ ఫాంకు తెరతీసినట్టు  ఉబెర్‌ బిజినెస్ హెడ్  మధు కన్నన్‌ చెప్పారు.అతివేగవంతమైన డిజిటల్ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి  తేనున్నట్టు అనిర్‌ బెన్‌  ఎస్ ముఖర్జీ అన్నారు. జియో, ఉబెర్‌ ద్వారా  వినియోగదారులకు వివిధ  కాంప్లిమెంటరీ  ప్రోగ్రాముల ద్వారా అనేక అవకాశాలను కల్పించనున్నామన్నారు.   జియో మనీ ద్వారా ప్రతి  ఉబెర్ రైడర్‌కు  ప్రత్యేక ప్రోత్సాహకాలను  అందించనున్నట్టు చెప్పారు.
 

మరిన్ని వార్తలు