ఎమ్మెల్యే పదవి వదులుకున్న మాజీ సీఎం

25 Aug, 2015 16:37 IST|Sakshi
ఎమ్మెల్యే పదవి వదులుకున్న మాజీ సీఎం

పాట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఎమ్మెల్యే పదవిని మాంఝీ వదులుకున్నారని ఆయన సన్నిహిత సహాయకుడు దనిశ్ రిజ్వాన్ తెలిపారు. అసెంబ్లీ కార్యదర్శి రామ్ ముఖియాను కలిసి రాజీనామా లేఖ సమర్పించారని వెల్లడించారు. వెంటనే తన రాజీనామా ఆమోదించాలని మాంఝీ కోరినట్టు చెప్పారు. జహానాబాద్ జిల్లాలోని జహనాబాద్ జిల్లాలో మగ్దంపూర్ అసెంబ్లీ స్థానానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు.  70 ఏళ్ల మాంఝీ 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

మరోవైపు తాను స్థాపించిన హిందూస్తానీ ఆవామ్ మోర్చా(హెచ్ఏఎం) పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా మాంఝీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో జేడీ(యూ) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు హెచ్ఏఎం జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. హెచ్ఏఎం ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో చేరింది.

మరిన్ని వార్తలు