ఉద్యోగ అవకాశాలు

10 Sep, 2015 08:53 IST|Sakshi
ఉద్యోగ అవకాశాలు

ఏఏఐలో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌లు
ఎయిర్‌పోర్‌‌ట్స అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ).. జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఖాళీలు-400), ఎలక్ట్రానిక్స్(ఖాళీలు-198)) ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఫిజిక్స్, మ్యాథ్‌‌సల్లో 60 శాతం మార్కులతో రెగ్యులర్ డిగ్రీ లేదా ఎలక్ట్రానిక్స్, టెలి కమ్యూనికేషన్‌‌స, ఐటీల్లో బీఈ/బీటెక్/ పూర్తి చేసిన వారు అర్హులు. ఎలక్ట్రానిక్స్ పోస్టులకు గేట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీలు: ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ - అక్టోబర్ 13, ఎలక్ట్రానిక్స్ - అక్టోబర్ 9. వివరాలకు www.aai.aero చూడొచ్చు.

ఓఎన్‌జీసీలో గ్రాడ్యుయేట్ ట్రైనీలు
గేట్ పరీక్ష 2016 ద్వారా గ్రాడ్యుయేట్ ట్రైనీ (ఇంజనీరింగ్ అండ్ జియో సెన్సైస్) పోస్టుల భర్తీకి ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్  కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 60 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచ్‌లో బీటెక్ ఉత్తీర్ణత. ఏఈఈ (రిజర్వాయర్), జియాలజిస్ట్, జియోఫిజిస్ట్ పోస్టులకు 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణులు కూడా అర్హులే. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. గేట్ దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 1. వివరాలకు www.ongcindia.com చూడొచ్చు.

ఐఈటీలో అధ్యాపక పోస్టులు
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ(ఐఈటీ)-లక్‌నవూ.. వివిధ విభాగాల్లో ప్రొఫెసర్(ఖాళీలు)-08, అసోసియేట్ ప్రొఫెసర్(ఖాళీలు)-08, అసిస్టెంట్ ప్రొఫెసర్(ఖాళీలు)-14 భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.   ఆన్‌లైన్‌లో పూర్తి చేసిన దరఖాస్తులను ప్రింట్ తీసి ‘ది రిజిస్ట్రార్, ఉత్తరప్రదేశ్ టెక్నికల్ యూనివర్సిటీ, ఐఈటీ క్యాంపస్, సీతాపూర్ రోడ్, లక్‌నవూ-226021’కు పోస్ట్ ద్వారా పంపాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది సెప్టెంబర్ 25. ప్రింటవుట్ దరఖాస్తులను పోస్టు ద్వారా పంపేందుకు చివరి తేది అక్టోబర్ 5.  వివరాలకు http://ietlucknow.edu/ requirement.htm చూడొచ్చు.

బీఐఎస్‌లో ఇంజనీరింగ్ పోస్టులు
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్‌‌డ్స (బీఐఎస్).. వివిధ విభాగాల్లో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మెకానికల్ (ఖాళీలు)-28, మెటలర్జికల్(ఖాళీలు)-12, సివిల్ (ఖాళీలు)-28, ఎలక్ట్రికల్(ఖాళీలు)-20, ఎలక్ట్రానిక్స్ (ఖాళీలు)-04, కెమికల్(ఖాళీలు) -12, లెదర్ టెక్నాలజీ(ఖాళీలు)-01, కెమిస్ట్రీ (ఖాళీలు)-08, మైక్రో బయాలజీ(ఖాళీలు)-04. 60శాతం మార్కులతో బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 21-30 ఏళ్లు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది సెప్టెంబర్ 24. వివరాలకు www.bis.org.in చూడొచ్చు.

మరిన్ని వార్తలు