ఈసీఐఎల్‌లో అకౌంట్ ఆఫీసర్లు

11 Oct, 2015 15:45 IST|Sakshi
ఈసీఐఎల్‌లో అకౌంట్ ఆఫీసర్లు

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్).. వికలాంగుల కోటాలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (ఖాళీలు-3), అకౌంట్స్ ఆఫీసర్ (ఖాళీలు-4), జూనియర్ హిందీ ట్రాన్‌‌సలేటర్ (ఖాళీలు-1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆన్ లైన్ దరఖాస్తుకి చివరి తేది అక్టోబర్ 26. వివరాలకు www.ecil.co.in చూడొచ్చు.

ఎయిమ్స్‌లో ఇంజనీర్లు
జోధ్‌పూర్‌లోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్).. ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) (సివిల్) (ఖాళీలు-3), జూనియర్ ఇంజనీర్ (జేఈ) (సివిల్) (ఖాళీలు-6) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఏఈకి వయోపరిమితి 35 ఏళ్లు, జేఈకి 30 ఏళ్లు. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 9. వివరాలకు www.aiimsjodhpur.edu.in చూడొచ్చు.

ఎన్‌హెచ్‌ఏఐలో మేనేజర్లు
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ).. వికలాంగులకు రిజర్వు చేసిన మేనేజర్ (టెక్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఖాళీలు.. 4. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 12. వివరాలకు www.nhai.org చూడొచ్చు.

ఈఎస్‌ఐసీలో ఇన్సూరెన్స్  మెడికల్ ఆఫీసర్లు
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్  కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ).. వివిధ రాష్ట్రాల్లోని ఈఎస్‌ఐ హాస్పిటల్స్/డిస్పెన్సరీల్లో ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్-2 (అల్లోపతిక్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 485. వయసు 30 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 10. వివరాలకు http://esic.nic.in చూడొచ్చు.

యూపీఎస్‌సీలో అసిస్టెంట్ డెరైక్టర్లు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ).. గ్రేడ్-1, గ్రేడ్-2 విభాగాల్లో అసిస్టెంట్ డెరైక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. అసి స్టెంట్ డెరైక్టర్స్ ఆఫ్ మైన్స్ (ఆక్యుపేషనల్ హెల్త్) (ఖాళీలు-2), అసిస్టెంట్ డెరై క్టర్స్ (కెమికల్)(ఖాళీలు-5), అసిస్టెంట్ డెరైక్టర్స్ (మెటలర్జీ)(ఖాళీలు-4). దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 29. వివరాలకు http://upsc.gov.in చూడొచ్చు.

ఎస్‌ఏసీలో అసిస్టెంట్లు
స్పేస్ అప్లికేషన్స్  సెంటర్ (ఎస్‌ఏసీ).. సైంటిఫిక్ అసిస్టెంట్(ఖాళీలు-2), లైబ్రరీ అసిస్టెంట్-ఏ (ఖాళీలు-2), టెక్నికల్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్) (ఖాళీలు-4), టెక్ని కల్ అసిస్టెంట్ (మెకట్రోనిక్స్) (ఖాళీలు-1), టెక్నీషియన్-బీ (ఎలక్ట్రీషియన్) (ఖాళీలు-16), టెక్నీషియన్-బీ (మెషినిస్ట్) (ఖాళీలు-1), టెక్నీషియన్-బీ (ఎలక్ట్రానిక్స్/ఐటీ) (ఖాళీలు-1). పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వయసు 35 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 2. వివరాలకు http://sac.gov.in చూడొచ్చు.

యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో ప్రొఫెసర్లు
యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ.. న్యాయ విభాగంలో ప్రొఫెసర్ (ఖాళీలు-13), అసోసియేట్ ప్రొఫెసర్ (ఖాళీలు-28), అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఖాళీలు-123) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలకు www.du.ac.in చూడొచ్చు.

డిఫెన్‌‌సలో ట్రేడ్స్ మెన్ మేట్
మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ .. ఫైర్ మ్యాన్ (ఖాళీలు-1), ట్రేడ్స్ మెన్ మేట్ (ఖాళీలు-16), బ్లాక్‌స్మిత్ (ఖాళీలు-1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వయసు 25 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 30. వివరాలకు అక్టోబర్ 10-16 ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ చూడొచ్చు.

మరిన్ని వార్తలు