'ఆంటీ' పేరిట అసభ్య పాట.. రిపోర్ట్‌ చేసినందుకు!

18 Sep, 2017 09:33 IST|Sakshi
మహిళా జర్నలిస్టుకు 'రేప్‌', హత్య బెదిరింపులు!
  • అసభ్య పాటను తప్పుబట్టినందుకు ఆన్‌లైన్‌లో బెదిరింపులు
  • సాక్షి, న్యూఢిల్లీ: లైంగికంగా అసభ్యంగా అశ్లీలంగా ఉన్న ఓ మ్యూజిక్‌ వీడియోను తప్పుబడుతూ వీడియో పెట్టడమే ఆమె నేరం అయింది. దీంతో ఆమెకు ఆన్‌లైన్‌లో బెదిరింపులు వస్తున్నాయి. తనను రేప్‌ చేసి.. హత్య చేస్తామని కొందరు మెసేజ్‌లు పంపుతున్నారని, బెంగళూరులో హత్యకు గురైన ప్రముఖ జర్నలిస్టు గౌరీలంకేశ్‌కు పట్టిన గతే తనకూ పడుతుందని వాట్సాప్‌లో బెదిరిస్తున్నారని జర్నలిస్ట్‌ దీక్ష శర్మ తెలిపారు.

    ఓం ప్రకాశ్‌ మెహ్రా అనే యూట్యూబర్‌ 'బోల్నా ఆంటీ ఆహు క్యా' పేరిట ఓ అసభ్య మ్యూజిక్‌ వీడియోను పోస్టు చేశాడు. డబుల్‌ మీనింగ్‌.. అసభ్య పదజాలంతో మహిళలను కించపరిచేలా ఉన్న ఈ పాటను చాలామంది యూట్యూబ్‌లో చూశారు. దీనికి 28వేల లైకులు వచ్చాయి. అయితే, ఈ అసభ్య వీడియోపై పలువురు ఫిర్యాదు చేయడంతో యూట్యూబ్‌ దీనిని తొలగించింది. అయితే, ఈ వీడియోను తప్పుబడుతూ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ 'క్వింట్‌'లో కథనాన్ని రాసిన దీక్ష శర్మకు బెదిరింపులు వెల్లువెత్తాయి. కాపీరైట్‌ హక్కుల ఉల్లంఘన, పలువురు నెటిజన్ల ఫిర్యాదుల వల్లే ఈ వీడియోను యూట్యూబ్‌ తొలగించిందని, ఇందుకు తమ కథనం ఒక్కటే కారణం కాదని దీక్ష శర్మ అంటున్నారు. మరోవైపు ఈ వీడియోను యూట్యూబ్‌ తొలగించినప్పటికీ ఇతర యూజర్లు దీనిని మళ్లీ అప్‌లోడ్‌ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ వీడియో అభిమానులు 'ద క్వింట్‌' కార్యాలయం ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు