మిస్ అయిన జస్ట్ డయల్

17 Aug, 2016 11:27 IST|Sakshi
మిస్ అయిన జస్ట్ డయల్

ముంబై: ఎనలిస్టుల అంచనాలను అందుకోవడంలో జస్ట్ డయల్ మిస్ అయింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి  త్రైమాసికంలో నిరాశాజనక ఫలితాలను  నమోదు చేసింది.  క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో నికర లాభం 8 శాతం పెరిగి రూ. 39 కోట్లుగా ప్రకటించింది.  మొత్తం ఆదాయం 6 శాతం పెరిగి రూ. 176 కోట్లకు చేరింది.  మార్చి క్వార్టర్ లో రూ.179 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన సంస్థ ఈ సారి మరింత క్షీణించింది. అటు నిర్వహణ లాభం(ఇబిటా) కూడా 35 శాతం క్షీణించి రూ. 29 కోట్లకు పరిమితమైంది.  ఇబిటా మార్జిన్లు 27 శాతం నుంచి 17 శాతానికి పడిపోయాయి. దీంతో మదుపర్లు ఈ షేర్ అమ్మకాలవైపు మొగ్గు చూపారు. మొదట్లో 6 శాతానికిపైగా  పతనమైనా అనంతరం కోలుకుంది. దాదాపు  3శాతం నష్టాల్లో ఉంది

ఎక్కువ వ్యాపారకాంక్షతో ఇచ్చిన ఎగ్రెస్సివ్ డిస్కౌంట్లు ఆదాయాన్ని దెబ్బతీశాయని ఎనలిస్టుల అంచనా. మరోవైపు జొమాటో,  ప్రాక్టో లాంటి సంస్థల పోటీ గత కొన్ని త్రైమాసికాల్లో ఒత్తిడిపెంచిందని తెలిపారు.  
 

>
మరిన్ని వార్తలు