ఆ ముగ్గురిని గుర్తుచేసుకుంటూ..!

25 Aug, 2017 01:50 IST|Sakshi

న్యూఢిల్లీ: పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడే విషయంలో దార్శనికతను, గోప్యతను ప్రాథమిక హక్కుగా పేర్కొనే అంశంలో తమ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేసిన ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల పాత్రను గురువారంనాటి సుప్రీం తీర్పు గుర్తుచేసుకుంది. గతంలో గోప్యతపై తీర్పు సందర్భంగా జస్టిస్‌ సయ్యద్‌ ఫజల్‌ అలీ (1950–51), జస్టిస్‌ సుబ్బారావు(1958–67), జస్టిస్‌ హెచ్‌ఆర్‌ ఖన్నా (1971–77)లు గోప్యత ప్రాథమిక హక్కేనంటూ పేర్కొనటం వారి దార్శనికతకు  నిదర్శనమని జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్‌ తన తీర్పు కాపీలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు