వ్యతిరేక ఉద్యమం వచ్చే ప్రమాదం ఉంది

9 Sep, 2015 12:26 IST|Sakshi

న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితిలో అధికార భాషగా హిందీని చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ ఛైర్మన్, పద్మశ్రీ ప్రొ. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వెల్లడించారు. బుధవారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో కాళోజీ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలకు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్, తెలంగాణ సర్కార్ ప్రతినిధి తేజావత్ రామచంద్రు నాయక్తోపాటు రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయెల్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ... దేశంలో హిందీని అధికార భాషగా మార్చేందుకు యత్నించాలని కేంద్రానికి సూచించారు. ఉత్తర ప్రత్యుత్తర వ్యవహారాలన్నీ హిందీలోనే జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన మోదీ సర్కార్కు విజ్ఞప్తి చేశారు.

హిందీ అకాడమీలలో కేవలం ఉత్తరాది వారినే నియమిస్తున్నారని ఆయన ఆరోపించారు. హిందీ నేర్చుకున్న దక్షిణాది వారిని కూడా అకాడమీలలో నియమించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే హిందీ వ్యతిరేక ఉద్యమం వచ్చే ప్రమాదం ఉందని యార్లగడ్డ
లక్ష్మీ ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. రేపటి విశ్వహిందీ మహాసభలు భోపాల్లో జరుగనున్నాయని లక్ష్మీప్రసాద్ తెలిపారు.

మరిన్ని వార్తలు