కమల్‌ టు ఖుష్బూ! సినీ 'పన్నీర్‌' జల్లు!!

9 Feb, 2017 07:21 IST|Sakshi
కమల్‌ టు ఖుష్బూ! సినీ 'పన్నీర్‌' జల్లు!!

జయలలిత మృతిపై, తన రాజీనామాపై తొలిసారి పెదవివిప్పిన తమిళనాడు ఆపద్ధర్మ సీఎం ఓ. పన్నీర్‌ సెల్వంపై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. తొలిసారి ధైర్యంగా మాట్లాడి.. మనస్సులో మాటలో బయటపెట్టినందుకు, వెన్నుముక కలిగిన నేతగా నిరూపించుకున్నందుకు ఆయనను కొనియాడారు. కమల్‌ హాసన్‌, అరవింద స్వామి, ఖుష్బూ, గౌతమి తదితరులు పన్నీర్‌ సెల్వాన్ని ప్రశంసించారు. మంగళవారం మెరీనా బీచ్‌లో అమ్మ సమాధి వద్ద దీక్ష అనంతరం ఆయన శశికళకు వ్యతిరేకంగా మాట్లాడిన తీరును కొనియాడారు. వారు ఏమన్నారంటే..

కమల్‌ హాసన్‌: తమిళనాడు ప్రజలారా త్వరగా పడుకోండి. రేపు వాళ్లు మనకంటే ముందే నిద్రలేస్తారు. గుడ్‌నైట్‌.

సిద్ధార్థ: మెరీనాలో ఓపీఎస్‌. తమిళనాడు రాజకీయాలు గేమ్‌ ఆఫ్‌ థోర్న్స్‌, హౌస్‌ ఆఫ్‌ కార్డ్స్‌ (హాలీవుడ్‌ మూవీ)ను తలపిస్తున్నాయి.

ఆర్య: సరైన సమయంలో ఓపీఎస్‌ సర్‌ గొప్పగా, ధైర్యంగా మాట్లాడారు. ఆయనకు నా హాట్సాప్‌.

అరవింద స్వామి: బటానీలు తింటూ న్యూస్‌ చూస్తున్నా. హుప్స్‌ (ఓపీఎస్‌) ఒకటి పగిలింది. ఇక పాప్‌కార్న్‌ తింటాను

గౌతమి: అందుకే అమ్మ ఓపీఎస్‌ను ఎంచుకున్నారు. అంతరాత్మ మేరకు నడుచుకునే ధైర్యం ఆయనకు ఉంది. ఇది తమిళనాడుకు, అమ్మకు న్యాయం చేయడమే. (ప్రధాని నరేంద్రమోదీకి ట్యాగ్‌ చేశారు)

ఖుష్బూ: ఓపీఎస్‌ మౌనాన్ని వీడారు. ఒక హీరోగా ముందుకొచ్చారు. డ్రామా ఇప్పుడే మొదలైంది. దేశ రాజధానికి చెందిన 56 ఇంచుల ఛాతి ఉన్న నాయకుడి తరఫున ఓపీఎస్‌ పనిచేయడం లేదని నేను ఆశిస్తున్నా.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా