అందరూ సహకరించండి: కమల్నాథ్

3 Feb, 2014 12:49 IST|Sakshi
అందరూ సహకరించండి: కమల్నాథ్

కేంద్ర మంత్రి కమల్నాథ్ నేతృత్వంలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో అన్ని పార్టీలకు చెందిన సభ్యులందరూ సహకరించాలని ఈ సమావేశంలో కమల్నాథ్ కోరారు. ఇప్పటికే పెండింగులో ఉన్న బిల్లులను ఆమోదించడానికి, ఆరు అవినీతి వ్యతిరేక బిల్లులను కూడా ఆమోదించేందుకు ప్రతిపక్షాల సభ్యులు సహకరించాలని ఆయన కోరారు.

ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు ఎంతవరకు సజావుగా జరుగుతాయన్నది అనుమానంగానే కనపడుతోంది. ఒకవైపు విభజనకు అనుకూలంగాను, మరోవైపు విభజనను వ్యతిరేకిస్తూ ఇరుప్రాంతాలకు చెందిన ఎంపీలు, నాయకులు పార్లమెంటులో గట్టిగా వ్యవహరించే అవకాశం ఉండటంతో ఏం చేయాలో తెలియక యూపీఏ ప్రభుత్వం తలపట్టుకుంది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా