అడ్డగోలుగా మాట్లాడొద్దు.. ఆధారాలు ఉండాలిగా

20 Jul, 2015 12:47 IST|Sakshi
అడ్డగోలుగా మాట్లాడొద్దు.. ఆధారాలు ఉండాలిగా

పనాజీ: గోవాలో నీటి పారిశుద్ధ్యం, మురుగు వ్యవస్థ ప్రాజెక్టును అమెరికా సంస్థకు ఇచ్చే విషయంలో తామెవ్వరం ఏ తప్పూ చేయలేదని, ఆరోపణలు చేసేముందు ఆధారాలు కూడా చూపించగలగాలని గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ అన్నారు. ఆ సంస్థ తన మంత్రులకు డబ్బులిచ్చిందనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలు అని చెప్పారు.

కేంద్ర మంత్రి గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఈ ప్రాజెక్టుకు సంబంధించి కామత్ ప్రభుత్వంలోని మంత్రులకు అప్పట్లో ముడుపులు అందాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో దిగంబర్ కామత్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఆ ఆరోపణలు అవాస్తవాలు అని చెప్పారు. అడ్డగోలుగా మాట్లాడొద్దని ఏదైన అనే ముందు సాక్ష్యాధారాలు కూడా ఉండాలని హితవు పలికారు.

2009లో 'రివైవ్ వాటర్ అండ్ సెవేజ్ సిస్టం'  ప్రాజెక్టు చేపట్టేందుకు జైకా (జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ) అనే సంస్థ ముందుకొచ్చింది. ఈ సంస్థ వద్ద లంచాలు తీసుకొని ప్రాజెక్టు అప్పగించారని పారికర్ ఆరోపించారు. అయితే, నాడు తక్కువ ఖర్చుతో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ముందుకొచ్చిన సంస్థలో జైకా ఒకటని, ఇందులో మేం ప్రత్యేకంగా కల్పించుకోకుండా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ప్రాజెక్టు అప్పగించామని వివరణ ఇచ్చారు.

మరిన్ని వార్తలు