రోహిత్ చట్టం తేవాలి: కన్హయ్య కుమార్

31 Jul, 2016 17:21 IST|Sakshi

- మోదీ క్రసీ నడుస్తోంది
- విద్యావిధానంలో సమూల మార్పులు రావాలి
- లౌకిక విద్య కోసం రోహిత్ చట్టం తేవాలి
- బీఫ్ తినొద్దని పశువుల కోసం మనుషులను చంపుతున్నారు
- మీడియా సమావేశంలో జెఎన్‌ఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్య కుమార్

సాక్షి, హైదరాబాద్

ప్రజాస్వామ్యం పతనమై(డెమోక్రాష్) మోడీక్రసీ నడుస్తోందని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ, ఢిల్లీ) విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ ధ్వజమెత్తారు. దేశంలో మహిళ, దళిత, ముస్లిం అణిచివేత విధానాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఒక సెమినార్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన ఏఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు ఖాద్రీ, రాష్ట్ర అధ్యక్షుడు వేణు, ఇతర విద్యార్థి నాయకులు శంకర్, రాజారాంలతో కలిసి ఆదివారం మీడియాతో మాట్లాడారు.

 

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నెలకొన్న జాతి, మనువాద విధానాలు దేశంలోని ప్రధాన యూనివర్సిటీల్లో ఉన్నాయని, విద్యావ్యవస్థలో మార్పు తెచ్చేందుకు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రోహిత్ చట్టం తీసుకురావడం ద్వారా అందరికీ విద్య, సమసమాజ స్థాపనకు కషి చే యాలన్నారు. హైదరాబాద్ యూనివర్సిటీలోకి మీడియాను కూడా అడ్డుకుంటున్నారని, రోహిత్ మరణం తరువాత కూడా పరిస్థితుల్లో మార్పు లేదన్నారు. ప్రధానమంత్రి, విద్యా మంత్రుల డిగ్రీల విషయంలో ప్రశ్నలు తలెత్తే పరిస్థితి దేశంలో నెలకొందన్నారు. విద్యావ్యవస్థ పునాదుల నుంచే బలంగా ఉంటే ఎంసెట్ లీకేజీ వంటి దుష్పరిణామాలు పునరావతం కావన్నారు.

మరిన్ని వార్తలు