అతడ్ని ఉరితీసినందుకు రూ.10వేల చెక్

6 Aug, 2015 12:27 IST|Sakshi
అతడ్ని ఉరితీసినందుకు రూ.10వేల చెక్

మంగళూరు: ముంబయి పేలుళ్లలో దోషి యాకుబ్ మెమన్ను ఉరితీసిన తలారికి కర్ణాటకు చెందిన ఓ విద్యార్థి సంఘం రూ.10 వేల చెక్ను పంపించింది. అమాయకుల ప్రాణాలు బలిగొన్న అలాంటి వ్యక్తిని ఉరితీసిన తలారిని గౌరవించడం తమకు గర్వంగా ఉందని, అందుకే ఈ చెక్ పంపిస్తున్నామని మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది.

పుత్తూరులోని అంబికా పదవి పూర్వ విద్యాలయకు చెందిన కొంతమంది విద్యార్థి నాయకులు తొలుత ఈ ఆలోచన చేసి కాలేజీ యాజమాన్యానికి తెలియజేయగా వారు జైలు అధికారులను సంప్రదించారు. అందుకు వారు అనుమతించడంతో ప్రతి క్లాసులో నుంచి స్వచ్ఛంద విరాళాలు వసూలు చేసి మొత్తం పది వేల రూపాయలను తలారీకి పంపించారు.

మరిన్ని వార్తలు