డాక్టర్ షాక్: రూ.40కి బదులు 4 లక్షలు స్వైప్

14 Mar, 2017 13:14 IST|Sakshi
డాక్టర్ షాక్: రూ.40కి బదులు 4 లక్షలు స్వైప్
మంగళూరు : కార్డుల స్వైప్ లతో పెద్ద తలనొప్పి వచ్చి పడింది. ఎంత డ్రా చేసుకుంటున్నారో తెలియదు. మొబైల్ ఫోన్ కు మెసేజ్ రాలేదు ఇక అంతే సంగతులు. డబ్బులు గోవిందే. ఇలాంటి సంఘటనే ఒకటి కొచ్చి-ముంబాయి జాతీయ రహదారి దగ్గర్లో ఉడిపి వద్ద చోటుచేసుకుంది.  గుండ్మి టోల్ గేట్ వద్ద మైసూరుకు చెందిన  ఓ డాక్టర్ కార్డుపై రూ.40 బదులు రూ.4లక్షలు స్వైప్ చేశారు. మైసూరుకు చెందిన డాక్టర్ రావు, తీరప్రాంతం మీదుగా ముంబాయికి వెళ్తున్నారు. రూ.40 టోల్ చెల్లించడానికి ఆయన తన డెబిట్ కార్డు ఇచ్చారు. కార్డును స్వైప్ చేసిన అటెండెంట్ పీఓసీ రశీదు కూడా ఇచ్చాడు.
 
కానీ మొబైల్ కు వచ్చిన మెసేజ్ లో మాత్రం రూ.4లక్షల తన అకౌంట్ నుంచి డెబిట్ అయినట్టు వచ్చింది. ఈ విషయాన్ని వెంటనే డాక్టర్ టోల్ గోట్ స్టాఫ్ కు నోటీసు చేశారు. అయితే వారు మాత్రం తమ తప్పిదాన్ని  ఒప్పుకోవడానికి ససేమీరా అన్నారు.  టోల్ గేట్ వారు చేసిన ఈ తప్పిదంపై రావు దగ్గర్లోని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి పోలీసులు దిగడంతో ఇక చచ్చినట్టు వారు తమ తప్పిందాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది.  టోల్ గేట్ అటెండెంటే తప్పుడు మొత్తాన్ని స్వైప్ చేసినట్టు తెలిపాడు. డాక్టర్ కు తన నగదుతో పాటు, వారు అదనపు మొత్తాన్ని కూడా ఆఫర్ చేశారు. కానీ డాక్టర్ మాత్రం తన డబ్బుల్నే తీసుకున్నాడు. ఈ టోల్ గేట్ వద్ద రోజుకి రూ.8 లక్షల వరకు వసూలు అవుతున్నట్టు పోలీసులు చెప్పారు. 
 
మరిన్ని వార్తలు