సీఎం కుర్రకుంక: కేకే

17 Jul, 2013 18:18 IST|Sakshi

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుర్రకుంకలా వ్యవహరిస్తున్నారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వొద్దంటూ కాంగ్రెస్ అధిష్ఠానానికి ఆయన చెబుతున్నారని టీఆర్ఎస్ జాతీయ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కె.కేశవరావు మండిపడ్డారు. ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ కార్యకర్తలపైనా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వెంట కొందరు టి-మంత్రులు, నేతలు తిరుగుతున్నారని.. వీళ్లకు సిగ్గుందా అని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ మంత్రులు, నేతలు ద్రోహులేనని.. సీఎం చెబుతున్న లెక్కలన్నీ తప్పులేనని కేకే అన్నారు. తెలంగాణకు లక్ష కోట్ల ప్యాకేజి కావాలని ముఖ్యమంత్రి అడిగారని, అంటే గతంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందని ఆయన అంగీకరిస్తున్నట్లేనా అని ప్రశ్నించారు. చిన్న రాష్ట్రాలకు ఇందిరాగాంధీ వ్యతిరేకమన్న వాదన సరైనది కాదని, ఆమె హయాంలోనే కొత్తగా 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయని గుర్తుచేశారు. చరిత్ర తెలుసుకోవాలని ఆయన ముఖ్యమంత్రికి సూచించారు. తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపే చూసిందని కేకే ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు