కోల్ కతాకు పాకిన 'కిస్ ఆఫ్ లవ్'

6 Nov, 2014 16:04 IST|Sakshi
కోల్ కతాకు పాకిన 'కిస్ ఆఫ్ లవ్'

కోల్ కతా: నైతికతపై కర్ర పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ కేరళలోని కొచ్చిలో మొదలైన 'కిస్ ఆఫ్ లవ్' నిరసన ఇప్పడు కోల్కతాకు పాకింది. మోరల్ పోలీసింగ్, లింగ వివక్షకు వ్యతిరేకంగా రెండు యూనివర్సిటీల విద్యార్థులు ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రెసిడెన్సీ యూనివర్సిటీ విద్యార్థులు గురువారం ఇండియన్ కాఫీ హౌస్ ఎదురుగా గుమిగూడి 'కిస్ ఆఫ్ లవ్'కు సంఘీభావంగా ప్లకార్డులు ప్రదర్శించారు.

జాదవ్పూర్ యూనివర్సిటీ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కలిసి దాదాపు 300 మంది బుధవారం సాయంత్రం జాదవ్పూర్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టారు. పరస్పరం ఆలింగనం చేసుకుని, ముద్దులు పెట్టుకుని నిరసన తెలిపారు. 'మా దేహం, మా ఆలోచన, మోరల్ పోలీసింగ్ ను ఒప్పుకోం' అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. తమ స్వేచ్ఛను అడ్డుకుంటున్నందుకు, భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టామని విద్యార్థులు తెలిపారు.

మరిన్ని వార్తలు