కేటీఎం సూపర్ స్పోర్ట్స్ బైక్స్ లాంచ్

19 Jan, 2017 14:25 IST|Sakshi

న్యూఢిల్లీ: స్పోర్ట్స్ బైక్ మేకర్ కెటిఎమ్  2017 సంవత్సరంలో  అప్ గ్రేడ్  చేసిన   సూపర్ స్పోర్ట్స్ బైక్స్ ను భారత మార్కెట్లో గురువారం ప్రవేశపెట్టింది.   ఆర్‌సి200 , ఆర్‌సి390  అప్ గ్రేటెడ్  వెర్షన్ మోటార్  బైక్స్ ను   బజాజ్ ఆటో లాంచ్ చేసింది.  ఆర్‌సి200  ధరను 1.71 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఆర్‌సి390 రూ.2.25 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)  నిర్ణయించింది. 2017 కు చెందిన ఆర్‌సి390 మోడల్ లో మెకానికల్‌గా మార్పులు చేయగా, ఆర్‌సి200 వేరియంట్ ఎలాంటి మార్పులు లేకుండా  మునుపటి సాంకేతిక అంశాలతో విడుదల చేసింది. ఈ రెండు వాహనాలను యూరో-4 ఉద్గార నియమాలను పాటిస్తూ  లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్  ఇంజీన్, 6 స్పీడ్  ట్రాన్స్  మిషన్ తో అందుబాటులోకి తీసుకొచ్చింది.

సాంకేతికంగా 2017 కెటిఎమ్ ఆర్‌సి390 మోటార్  బైక్ లో వైర్ థొరెటల్, స్లిప్పర్ క్లచ్ ,  320ఎంఎం ఫ్రంట్  డిస్క్ బ్రేక్ ద్వారా రైడ్ వంటి కొత్త ఫీచర్స్ ను జత చేసింది.  ఇంజిన్ టార్క్ ను  44బీహెచ్ పీ,   35ఎన్ ఎం, గత సంవత్సరం నమూనా మోటార్  బైక్  లాగే ఉంచింది. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ప్లేస్ మెంట్ లో మార్పులు చేసింది.  ఆఫ్ ఆన్ చేసుకునే  యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, రైడ్ బై వైర్ టెక్నాలజీతోపాటు ముందు వైపున 320ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్  అమర్చింది.  దీంతోపాటు న్యూ గ్రాఫిక్స్ తో కొత్తగా డిజైన్ చేసింది.

ఆర్‌సి200 లో  కాస్మోటిక్ మార్పులు తప్ప  అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ సహా మెకానికల్ గా ఎలాంటి మార్పులు  లేవు. 199సీసీ లో యూనిట్ లో మాత్రం 25బిహెచ్‌పి ,19.2 టార్క్ కలిగి ఉంది.

 

మరిన్ని వార్తలు