లైలాఖాన్ అస్తిపంజరాలను తిరస్కరించిన తండ్రి

3 Dec, 2013 19:39 IST|Sakshi

ముంబై: నటి లైలాఖాన్, ఆమె ఐదుగురు సభ్యుల హత్య కేసు వివాదం మరో మలుపు తిరిగింది. వీరంతా మూడేళ్ల క్రితం హత్యకు గురయ్యారు. పోలీసులు ఇటీవల వారి అస్తిపంజరాలను అప్పగించగా లైలా తండ్రి నాదిర్ పటేల్ తిరస్కరించారు. పోలీసులు దర్యాప్తును పక్కదోవ పట్టించారని, హంతకులు ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు. ఈ విషయాలను కోర్టుకు కూడా తెలియజేశానని పటేల్ విలేకరులకు తెలిపారు. లైలా మారుతండ్రి పర్వేజ్ తక్ ఈ ఆరు హత్యలకు కారకుడని పేర్కొంటూ ముంబై క్రైంబ్రాంచ్ పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు.

 

కిష్టవార్‌కు చెందిన తక్ లైలాతోపాటు ఆమె తల్లి షెలీనా, పెద్దక్క అజ్మీనా, సోదరి జారా, సోదరుడు ఇమ్రాన్, సమీప బంధువు రేష్మాను హత్యమార్చడని పేర్కొంటూ గత అక్టోబర్‌లో చార్జిషీటు సమర్పించారు. షెలీనా తన రెండో భర్త అసిఫ్‌తో సంబంధాలు కొనసాగించడం సహించలేకే కుటుంబ సభ్యులందరినీ హతమార్చానని టక్ అంగీకరించాడు. షెలీనాకు టక్ మూడోభర్తని పోలీసులు తెలిపారు. అయితే పటేల్ మాత్రం ఆసిఫ్‌పై అనుమానం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు