-

లాలూకి కొడుకుల బెడద ఉందా?

3 Jan, 2017 18:06 IST|Sakshi
లాలూకి కొడుకుల బెడద ఉందా?
తండ్రి ములాయంకు చెక్ పెడుతూ కొడుకు అఖిలేష్ యాదవ్ వ్యవహరిస్తున్న వైఖరి ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్కు  'సన్' స్ట్రోక్ కు సంకేతాలుగా మారుతున్నాయట. ఆయన కొడుకులు కూడా ఇదే మాదిరి రాజకీయ సంక్షోభం లేవనెత్తుతారేమోనని లాలూ ఆందోళన చెందాల్సినవసరం ఉందని బీజేపి సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ వ్యాఖ్యానించారు. లాలూ ప్రసాద్ ఇద్దరు కొడుకులు తేజస్వి ప్రసాద్ యాదవ్ ఆ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండగా.. మరో కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ మంత్రిగా ఉన్నారు. సమాజ్వాద్ పార్టీలో నెలకొన్న వివాదంతో లాలూకు కూడా కొడుకుల బెడద ఉందని తనకు అనిపిస్తున్నట్టు సుశీల్ కుమార్ మోదీ తన నివాసంలో నిర్వహించిన జనతా దర్బార్లో వ్యక్తంచేశారు.
 
అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో సమాజ్వాద్ పార్టీలో ముదురుతున్న రాజకీయ సంక్షోభంపై లాలూ ఇప్పటికే మధ్యవర్తిత్వంగా బంధువుడి హోదాలో ములాయం సింగ్కు, అఖిలేష్‌కు హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. సఖ్యతగా ఉండకపోతే, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లబ్ది పొందే అవకాశముందని లాలూ హెచ్చరించారు. కానీ ఆయనకు కూడా మంత్రి పదవుల్లో ఉన్న ఇద్దరు కొడుకులతో ముప్పు పొంచి ఉందని బీజేపీ సీనియర్ నేత అన్నారు. అఖిలేష్ వ్యవహరించిన తీరే దీనికి సంకేతమన్నారు. పార్టీ నాయకత్వం తీసుకోవడానికి ఆర్జేడీ సుప్రీం కొడుకులు కూడా తండ్రి ఛాయల నుంచి బయటికి రావాల్సి ఉందని సుశీల్ కుమార్ మోదీ వ్యాఖ్యానించారు. 
మరిన్ని వార్తలు