జైల్లోనూ 'జడ్ ప్లస్' కావాలి: లాలూ

1 Oct, 2013 13:25 IST|Sakshi
జైల్లోనూ 'జడ్ ప్లస్' కావాలి: లాలూ

రాంచీ: జైల్లోనూ తనకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కొనసాగించాలని బీహార్‌ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కోరారు. అయితే లాలూ విజ్ఞప్తిని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం  తోసిపుచ్చింది. జైల్లో జడ్ ప్లస్ కేటగిరి భద్రత కొనసాగించేది లేదని కోర్టు స్పష్టం చేసింది. 'దాణా కుంభకోణంలో దోషిగా నిర్ధారణయిన తర్వాత.. జైల్లోనూ తనకు భద్రత కొనసాగించాలని కోర్టును లాలూ అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది' అని జిల్లా అడిషనల్ మేజిస్ట్రేట్(లా లండ్ ఆర్డర్), జైలు సూపరిండెంటెంట్ ధర్మేంద్ర పాండే తెలిపారు.

గత కొన్నేళ్లుగా లాలూకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కొనసాగుతోంది. జైలుకు వెళ్లే వరకు ఆయనకు నేషనల్ సెక్యురిటీ గార్డ్ బ్లాక్ కమెండోస్ ఆయనకు భద్రత కల్పిస్తూ వచ్చారు. లాలూప్రసాద్ యాదవ్ ప్రస్తుతం రాంచీ శివార్లలోని బిర్సా ముండా కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఈ కేసులో లాలూ సహా మిగతా 37 మందికి అక్టోబర్‌ 3న శిక్షను ఖరారు చేయనున్నారు. రెండేళ్లకు పైబడి శిక్ష పడితే ఆయన లోక్‌సభ సభ్యత్వం తక్షణం రద్దవుతుంది.

మరిన్ని వార్తలు