ఆ సీఎం ఇంట్లో ఇప్పటికీ కరెంట్ లేదు

25 Oct, 2015 14:27 IST|Sakshi
ఆ సీఎం ఇంట్లో ఇప్పటికీ కరెంట్ లేదు

పాట్నా: అది బీహార్లోని నలంద జిల్లాలో గల కళ్యాణ్ బిగా అనే గ్రామం. అక్కడ 24గంటలు విద్యుత్ సౌకర్యం ఉండగా.. ఒక్క ఇంటికి మాత్రం అసలు విద్యుత్ కనెక్షన్ లేదు. అదేదో పేదవాడి ఇళ్లనుకుంటే పొరపాటే. ఎందుకంటే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇళ్లు. ఆ ఇల్లు నిర్మించి చాలా ఏళ్లు అయినా ఇప్పటి వరకు ఆ ఇంట్లో విద్యుత్ వెలుగులు మాత్రం లేవు. ఈ విషయంపై ఆరా తీయగా.. ఆ ఇంటిని కాపలాగా ఉండి సంరక్షించుకునే సీతారం అనే పెద్ద మనిషి వివరణ ఇచ్చాడు. 'ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కట్టుకున్న ఈ ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. బీహార్లోని ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ వచ్చే వరకు తన ఇంటికి కనెక్షన్ తీసుకోనని నితీశ్ కుమార్ చెప్పారు' అని అతను చెప్పాడు.

దీంతోపాటు ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ నితీశ్పై అభిమానం కలిగి ఉన్నారని, మూడోసారి కూడా నితీశ్ ముఖ్యమంత్రి అవుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్జేడీతో కలిసి ఈసారి జేడీయూ ఎన్నికల బరిలోకి దిగడం ప్రశ్నించగా.. నితీశ్ ఆధ్వర్యంలో లాలూ ప్రసాద్ మంచి అభివృద్ధి చేస్తాడని చెప్పాడు. ప్రారంభంలో బీహార్లో నేర ప్రవృత్తి ఎక్కువగా ఉండేదని, కానీ తుపాకీ సాయం లేకుండానే ఆయన దానిని నిర్మూలించాడని చెప్పారు. మున్ముందు కూడా ఇలాగే బీహార్ ఆయన ఆధ్వర్యంలోనే ఆర్థిక పురోగతి సాధిస్తుందని తెలిపాడు.

మరిన్ని వార్తలు