ఈ కారు ధర రూ.3.45 కోట్లు

1 Feb, 2017 20:31 IST|Sakshi
ఈ కారు ధర రూ.3.45 కోట్లు

న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ సంస్థ లంబార్గిని  మరో లగ్జరీకార్ ను భారత  మార్కెట్లో ప్రవేశపెట్టింది.  లంబార్గిని హరికేన్ ఆర్డబ్ల్యుడీ స్పైడర్ పేరుతో దీన్ని లాంచ్ చేసింది.  ఈ టాప్ వెర్షన్ కారు రూ 3.45 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) గా ధరకు భారతదేశం లో ఇప్పుడు అందుబాటులో ఉంది.  లంబార్గిని హరికేన్ ఆర్డబ్ల్యుడీ   కుపేను పోలిన ఫీచర్స్ తోనే దీన్ని లాంచ్ చేసింది.

5.2 లీటర్ ఇంజిన్, వీ10 పవర్, మల్టీ పాయింట్ ఇంజెక్షన్ + డీఎస్ఐ డీజిల్  గరిష్ట టార్క్ 540, సెవెన్ స్పీడ్ డ్యుయల్ క్లచ్ గేర్ బాక్స్,  రియర్ వీల్ డ్రైవ్  సిస్టం,  రియర్ మెకానికల్ సెల్ఫ్ లాకింగ్ , 319 కిలోమీటర్ల వేగంతో  కేవలం 3.6 సెకన్లలో0-100కి.మీ. 10.4 సెకన్లలో 0-200కి.వేగాన్ని అందుకోగలదు. 2620ఎంఎం వీల్ బేస్ తో  లీటరుకు 12.1కి.మీ  ఇంధన సామర్ధ్యంతో ఇది అందుబాటులోకి వచ్చింది. భారత్ లో  ఇది ఫెరారి ఎఫ్ ఎఫ్, బీఎండబ్ల్యు ఐ 8, ఆడి ఆర్ 8లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

 కాగా  భారతలో తమ నెట్‌వర్క్‌ విస్తరణకు భారీగా శ్రద్ధ పెడుతున్న  లంబార్గిని కంపెనీ ప్రస్తుతం  ఇండియాలో 3-6 కోట్ల రూపాయల విలువైన కార్లను అమ్ముతోంది. కంపెనీకి ఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో షోరూమ్‌లున్నాయి.

 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు