ల్యాంకో ఇన్‌ఫ్రాకు 'సెయిల్' ప్రాజెక్టు

1 Aug, 2013 10:13 IST|Sakshi
ల్యాంకో ఇన్‌ఫ్రాకు 'సెయిల్' ప్రాజెక్టు

ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్కు చెందిన తస్రా బొగ్గు గని ప్రాజెక్టును అభివృద్ధి చేసే కాంట్రాక్టును ల్యాంకో ఇన్ఫ్రా దక్కించుకుంది. సెయిల్ సొంత అవసరాల కోసం ఏర్పాటు చేసుకుంటున్న విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి ఈ మైనింగ్ను అభివృద్ధి చేస్తున్నట్లు ల్యాంకో ఇన్ఫ్రా బుధవారం బీఎస్ఈకి తెలియచేసింది. జార్ఖండ్లో 250 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను తస్రా కలిగి వుంది. ఈ బొగ్గు నిక్షేపాలు లభించడం వల్ల ల్యాంకో విస్తరణ ప్రణాళికలకు అవసరమైన ముడి సరుకు అందుబాటులోకి రానుంది. ల్యాంకో సంస్థ ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, ట్రేడింగ్‌లలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిన విషయం తెల్సిందే.

మరిన్ని వార్తలు