ఇదే చివరి అవకాశం..త్వరపడండి!

12 Dec, 2016 15:06 IST|Sakshi
ఇదే చివరి అవకాశం..త్వరపడండి!

ముంబై:  కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద  నోట్లతో చెల్లింపులకు  నేడే (నవంబర్ 24)చివరి రోజు. రద్దయిన  రూ.500, రూ.1000  నోట్ల వినియోగానికి  ప్రభుత్వం  విధించిన డెడ్ లైన్  ఇవాల్టితో ముగియనుంది. ముఖ్యంగా పెట్రోల్ బంకులు, హాస్పిటల్స్,రైలు, బస్సు టికెట్లు సహా ప్రభుత్వానికి సంబంధించిన బిల్లులు  చెల్లించడానికి  రద్దయిన పాతనోట్ల అనుమతికి రోజు అర్థరాత్రి వరకే అవకాశం ఉంది.   పాతనోట్లని కేవలం బ్యాంకుల్లో మార్పిడికి, లేదా డిపాజిట్లు చేసేందుకు అవకాశం ఉంది. అది కూడా  డిశెంబర్ 30 వరకే.
1.ప్రభుత్వాసుపత్రులు
2. రైల్వే టిక్కెట్లు
3.పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్
4. ఎయిర్ లైన్ టిక్కెట్లు
5. మిల్క్ బూత్స్
6. బరియల్ గ్రౌండ్స్ (శ్మశానాలు)
7. పెట్రోల్ బంకులు
8, మెట్రో రైలు టిక్కెట్లు
9. నేషనల్ హైవేలపై టోల్ ఛార్జీలు
10. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లతో మెడిసిన్స్
11. ఎల్పీ జీ సిలిండర్స్
12. రైల్వే కేటరింగ్స్
13.కరెంట్, వాటర్ బిల్స్
14. ఆర్కియాలజీ సర్వే డిపార్ట్ మెంట్ల ఎంట్రీ టిక్కెట్లు
15. కోఆపరేటివ్ స్టోర్లు
16. ప్రభుత్వశాఖలు విధించిన పన్నులు, జరిమానాలు
17. ప్రభుత్వ సంస్థలు విక్రయించే విత్తన విక్రయ కేంద్రాలు
కాగా  నవంబర్ 8 న  కేంద్ర ప్రభుత్వం  ప్రకటించి పెద్ద నోట్ల రద్దు దేశవ్యాప్తంగా ఆందోళన రాజేసింది. అటు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కూడా ఈ వ్యవహారంతో అట్టుడుకుతున్నాయి.  మరోవైపు  ఆర్థికశాఖ ఎన్ని ఉపశమన చర్యలు ప్రకటిస్తున్నప్పటికీ,  16రోజుల తర్వాత కూడా బ్యాంకుల వద్ద, ఏటీఏం  సెంటర్ల వద్ద  జనం  పడిగాపులు మాత్రం  కొనసాగుతున్నాయి.  అటు పాత నోట్ల చలామణి గడువును పొడిగించాలన్న డిమాండ్  కూడా భారీగానే వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు