లావా ‘ఐరిస్ ప్రో 30’ మొబైల్@ రూ.15,999

18 Jan, 2014 01:17 IST|Sakshi
లావా ‘ఐరిస్ ప్రో 30’ మొబైల్@ రూ.15,999

న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ కంపెనీ లావా కొత్త స్మార్ట్‌ఫోన్, ఐరిస్ ప్రో 30ను శుక్రవారం మార్కెట్లోకి తెచ్చింది. 4.7 అంగుళాల ఐపీఎస్ ఓజీఎస్ స్క్రీన్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.15,999 అని  లావా ఇంటర్నేషనల్ సీఎండీ హరి ఓమ్ రాయ్ చెప్పారు. ఆండ్రాయిడ్ 4.2.2 ఓఎస్‌పై పనిచేసే ఈ డ్యుయల్ సిమ్ ఫోన్‌లో 1.2 గిగాహెర్ట్స్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 4 జీబీ మెమెరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ,  8 మెగా పిక్సెల్ రియర్ , 3 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఫేస్ డిటెక్షన్ తదితర ఫీచర్లున్నాయని పేర్కొన్నారు. బ్యాటరీ లైఫ్‌ను 30% పెంచే కంటెంట్ ఎడాప్టివ్ బ్యాక్‌లిట్ కంట్రోల్(సీఏబీసీ) ఈ ఫోన్ ప్రత్యేకతని రాయ్ వివరించారు.  వచ్చే ఏడాది మార్చి కల్లా వంద కోట్ల డాలర్ల టర్నోవర్ సాధించడం లక్ష్యమని రాయ్ వివరించారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా