లాసెట్ -2015 అడ్మిషన్లకు సర్టిఫికెట్ల పరిశీలన

8 Sep, 2015 01:51 IST|Sakshi

 కేయూక్యాంపస్: తెలంగాణ రాష్ట్ర లా సెట్, పీజీ లా సెట్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను లా సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎంవీ రంగారావు సోమవారం వెల్లడించారు. ఈ నెల 12 నుంచి  లాసెట్‌లో ప్రవేశాలకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం కానుందన్నారు. ఇందుకోసం రాష్ర్టంలో 4 హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ, బషీరాబాగ్‌లోని నిజాం కాలేజీ, మారేడ్‌పల్లి గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ కేయూలోని అడ్మిషన్ల డైరక్టరేట్‌లు హెల్ప్‌లైన్ కేంద్రాలుగా ఉంటాయన్నారు.

ఎల్‌ఎల్‌బీ మూడు సంవత్సరాల కోర్సుకు ఈ నెల 12 నుంచి 14 వరకు, ఎల్‌ఎల్‌బీ ఐదు సంవత్సరాల కోర్సుకు 15 న ఉదయం 9 గంటలనుంచి , ఎల్‌ఎల్‌ఎం కోర్సులో ప్రవేశాలకు సర్టిఫికెట్ల పరిశీలన అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి నిర్వహిస్తారన్నారు. అభ్యర్థులు హెల్ప్‌లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవాలన్నారు. తర్వాత రెండు రోజుల్లో ఆన్‌లైన్‌లో ఏ కాలేజీలో అడ్మిషన్లు కావాలో ఎంపిక చేసుకోవాలన్నారు. వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. టీఎస్‌లాసెట్. టీఎస్‌సీహెచ్‌ఈ .ఏసీ.ఇన్‌లో సంప్రదించాలని సూచించారు.

మరిన్ని వార్తలు