సీఎంను, మమ్మల్ని చంపేస్తానన్నాడు

25 Mar, 2017 19:44 IST|Sakshi
సీఎంను, మమ్మల్ని చంపేస్తానన్నాడు

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేస్తానని వివేశ్ శర్మ అనే న్యాయవాది హెచ్చరించాడని ఆప్ ప్రతినిధి రాఘవ్ చద్దా ఆరోపించారు. కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ వేసిన పరువు నష్టం కేసులో నిందితులుగా ఉన్న కేజ్రీవాల్‌ను, తనను, మరో నలుగురు ఆప్ నేతలను హతమారుస్తానని వివేక్ బెదిరించాడంటూ చద్దా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు.

కేంద్ర మంత్రి  జైట్లీ వేసిన పరువు నష్టం కేసులో కేజ్రీవాల్‌, ఇతర ఆప్ నేతలపై విచారణ చేయాలని శనివారం పటియాల కోర్టు ఆదేశించింది. వివేక్ ఇదే కోర్టులో ప్రాక్టీస్ లాయర్‌గా పనిచేస్తున్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు