3 నిమిషాల్లోనే తమన్నా తమిళం నేర్పిస్తుంది!

8 Oct, 2016 20:25 IST|Sakshi
3 నిమిషాల్లోనే తమన్నా తమిళం నేర్పిస్తుంది!

కేవలం మూడు నిమిషాల్లోనే మీకు తమిళ భాష నేర్చుకోవాలని ఉందా? అయితే, మీరు మిల్కీ బ్యూటీ తమన్నా క్రాష్‌ కోర్సులో చేరాల్సిందే. చెన్నైలోకి గడిపేందుకు సరిపడా తమిళ భాషను మీకు మూడు నిమిషాల్లో నేర్పించేస్తానంటూ తమన్నా ముందుకొచ్చింది. ఆటో రిక్షా మాట్లాడటం దగ్గరి నుంచి ఇడ్లీ తెప్పించుకోవడం వరకు తమిళం నేర్పిస్తానంటూ ఓ ఫన్నీ వీడియోతో ఆవంతిక యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ‘ద క్వింట్‌’ వెబ్‌సిరీస్‌ కోసం యాంకర్‌కు సరదాగా తమిళ భాషను నేర్పించింది తమన్నా. చెన్నైలో, హైదరాబాద్‌లో తనను ‘తమన్నా’ అని కాకుండా ‘థమన్హా’ అని పిలుస్తారట. ఇంకా ఏం చెప్పిందో మీరే చూడండి!