లాభాల్లో దూసుకుపోయిన లెనోవో

18 Aug, 2016 12:33 IST|Sakshi
లాభాల్లో దూసుకుపోయిన లెనోవో

ప్రపంచంలో అతిపెద్ద వ్యక్తిగత కంప్యూటర్ (పీసీ) మేకర్, చైనాకు చెందిన  లెనోవా గ్రూప్ లిమిటెడ్  ఫలితాల్లో అదరగొట్టింది.   గురువారం ప్రకటించిన మొదటి త్రైమాసికంలో భారీ నికర లాభాలను ఆర్జించింది. ప్రధానంగా  పీసీ అమ్మకాల్లో మ్మకాలు గోరువెచ్చని మార్కెట్  అంచనాలు ఓడించింది.  బీజింగ్-ఆధారిత లెనోవా 64 శాతం  నికర లాభాలను  నమోదు చేసింది.  గత ఏడాది క్రితం ఇదే కాలంలో 105 మిలియన్ డాలర్లతో  పోలిస్తే జూన్ తో ముగిసిన త్రైమాసికంలో 173 మిలియన్ డాలర్లకు కు పెరిగింది. అయితే ఆదాయంలో 6 శాతం క్షీణతతో 10.5 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని  నమోదు చేసింది.  పీసీ మార్కెట్ కారణంగా  ఎనలిస్టులు ఊహించిన దాని కంటే కాస్త మెరుగ్గా  ఉన్నామని సంస్థ చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యాంగ్ యువాన్ జింగ్ తెలిపారు.   చైనా స్మార్ట్ఫోన్ మార్కెట్లో తమకు పోటీ చాలా ఆసక్తిగా ఉందని కానీ, చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా  డిమాండ్ తగ్గిందని  స్టాక్ మార్కెట్ ఫైలింగ్ లో తెలిపారు.

కాగా ట్రెండ్  ఫోర్స్ అంచనాల ప్రకారం, లెనోవా ప్రపంచ స్మార్ట్ఫోన్ మార్కెట్ 4.5 శాతం  వాటాను కలిగి ఉంది.  ఏప్రిల్-జూన్ మాసంలో   స్మార్ట్  ఫోన్ దిగ్గజాలు  శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కో లిమిటెడ్ 24 శాతం,  ఆపిల్15 శాతం షేర్ ను  సొంతం చేసకున్నాయి.
 

మరిన్ని వార్తలు