నన్ను నిద్రపోనివ్వండి అంటూ శాశ్వతంగా..

22 Apr, 2017 15:04 IST|Sakshi
నన్ను నిద్రపోనివ్వండి అంటూ శాశ్వతంగా..

అతడు ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుతున్నాడు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరంలో ఉన్నాడు. మరికొన్ని నెలలు ఆగితే బ్రహ్మాండమైన బంగారు భవిష్యత్తు అతడి ముందు ఉంది. కానీ.. 'నన్ను పడుకోనివ్వండి' అంటూ ఒక లేఖ రాసి శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు. నెహ్రూహాల్ బి బ్లాకులోని తన గదిలో సీలింగ్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేరళకు చెందిన ఎన్ నిధిన్ (22) మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంకు పంపారు. ఈ సంవత్సరంలో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఇది మూడోసారి. ఒక నెలలోనే ఇది రెండో ఆత్మహత్య.

నిధిన్ ప్రతిరోజూ అర్ధరాత్రి 2 గంటలకు అలారం పెట్టుకుని లేచి అప్పటినుంచి చదువుకునేవాడని పోలీసులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి అలారం ఎంతకూ ఆగకపోయేసరికి హాస్టల్లో ఉన్న ఇతర విద్యార్థులు ఏదో ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానించారు. వాళ్లు అతడి గదికి వెళ్లి తలుపు కొట్టినా ఎంతకీ తలుపు తీయలేదు. శుక్రవారం కూడా కనిపించకపోయేసరికి హాస్టల్ అధికారులకు చెప్పారు. కిటికీ అద్దాలు పగలగొట్టి చూస్తే.. అతడు సీలింగ్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే దగ్గర్లో ఉన్న హిజ్లీ ఔట్‌పోస్టులో పోలీసులకు సమాచారం తెలిపారు. ఖరగ్‌పూర్ అదనపు ఎస్పీ అక్కడకు వచ్చి, తలుపులు పగలగొట్టి నిధిన్ మృతదేహాన్ని కిందకు దించారు.

మరిన్ని వార్తలు