'ఐటీ ఇండస్ట్రి పండుగ చేసుకోవాలి'

16 Feb, 2017 09:39 IST|Sakshi
'ఐటీ ఇండస్ట్రి పండుగ చేసుకోవాలి'
ముంబై : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాల్లో తీసుకుంటున్న కఠిన చర్యలతో భారతీయ ఐటీ సర్వీసులు వణికిపోవాల్సిన పనిలేదని టీసీఎస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. అమెరికా ఉపాధి కల్పనను తగ్గించుకుంటే మనం సెలబ్రేట్ చేసుకోవాలే తప్ప దాన్ని కార్మికుల బేరసారాలుగా వ్యాఖ్యానించాల్సిన పనిలేదన్నారు. టీసీఎస్ ఒక ఉత్పత్తులు తయారుచేసే సంస్థగా కాకుండా.. ఖర్చును తగ్గించుకోవడానికి ఎందుకు ఎక్కువగా దృష్టిసారిస్తుందనే ప్రశ్నకు సమాధానంగా చంద్రశేఖరన్ ఈ సమాధానమిచ్చారు. నాస్కామ్  ఇండియా లీడర్షిప్ ఫోరమ్లో పాల్గొన్న చంద్రశేఖరన్, వివిధ రకాల పరిశ్రమల్లో, భౌగోళిక ప్రాంతాల్లో కొత్త అవకాశాలను  ఇండస్ట్రి వెలికి తీయాల్సి ఉందని చెప్పారు.
 
హెచ్-1బీ వీసాలో కఠినతరమైన నిబంధనలు తీసుకురావడం, వీసా ధరలు పెంచడం ఇవేమి దేశీయ ఐటీ ఇండస్ట్రికి సవాళ్లు కాదని, ఇవి కొత్త కొత్త అవకాశాలని  పేర్కొన్నారు. ఎక్కడైనా ఐటీ సర్వీసులు వర్క్ చేసే విధంగా, ఇప్పటికీ వెలికితీయని వాటిని అన్వేషించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. హెచ్-1బీ వీసాల్లో నిబంధనలు మార్చిన ప్రతీసారి, దేశీయ ఐటీ ఇండస్ట్రి చిక్కుల్లో పడుతుందని వార్తలు వస్తుంటాయి, కానీ ఇవి పరిశ్రమకు అత్యంత ఉత్తేజకరమని పేర్కొన్నారు. పరిశ్రమను మరింత విస్తరించడానికి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంతో సహకరిస్తుందన్నారు. ''మైక్రోసాఫ్ట్ ఉత్పత్తి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ లాంటిదాన్ని భారతీయులు ఎందుకు రూపొందించలేకపోయారని అడగటం కాదు.. మరో టీసీఎస్‌ని నీవెందుకు సృష్టించలేకపోయావని మనమే మైక్రోసాఫ్ట్‌ని ప్రశ్నించాలి'' అని చంద్రశేఖరన్ సవాల్ విసిరారు. 
మరిన్ని వార్తలు