పెట్రోల్, టెలికంలపై సెస్!

24 Sep, 2015 03:01 IST|Sakshi
పెట్రోల్, టెలికంలపై సెస్!

స్వచ్ఛభారత్ కోసం ప్రత్యేక పన్ను
సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛభారత్ అభియాన్ కోసం టెలికం, పెట్రోల్‌పై పన్ను విధించాలని కేంద్రానికి సిఫారసు చేయాలని నీతీ ఆయోగ్ ముఖ్యమంత్రుల ఉపకమిటీ బుధవారం నిర్ణయించింది. వీటితో పాటు బొగ్గు, ఉక్కు వంటి ఖనిజాలపై కూడా పన్ను విధించటం ద్వారా ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలని అభిప్రాయపడింది. స్వచ్ఛభారత్ అవసరమైన కోసం ఆర్థిక భారాన్ని 75% కేంద్రం భరించేలా, 25% రాష్ట్రాలు భరించేలా చూడాలని కేంద్రాన్ని కోరింది.

కమిటీ కన్వీనర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఉపకమిటీ, స్వచ్ఛభారత్ అభియాన్  కోసం పలు సూచనలు చేసింది.  తాము చేసిన సిఫార్సులతో పది రోజుల్లోగా నివేదికను రూపొందించి ప్రధానికి అందజేస్తామని బాబు ఆ తరువాత మీడియాకు వివరించారు. పొడి, తడి చెత్త... వ్యర్థాలు, మురుగునీరు పునర్నినియోగానికి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని, మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.15,000లు చెల్లించాలని సిఫార్సు చేశామన్నారు.

మరిన్ని వార్తలు